క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో సహజత్వం ఉంటుంది. భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తుంటారు. సినిమా చూసిన తర్వాత థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా… అవి ప్రేక్షకుల్ని వెంటాడుతూ ఉంటాయి. ‘నిన్నే పెళ్లాడతా’ ‘మురారి’ ‘చందమామ’ వంటి ఫ్యామిలీ సినిమాలు తీసినా..’గులాబీ’ ‘సింధూరం’ ‘అంతఃపురం’ వంటి వైవిధ్యమైన సినిమాలు చేసినా… ‘రాఖీ’ ‘చక్రం’ వంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా ఆ అంశాలు అయితే మిస్ అవ్వలేదు.
అయితే ‘గోవిందుడు అందరి వాడేలే’ ‘నక్షత్రం’ వంటి ఔట్ డేటెడ్ సినిమాలు కృష్ణవంశీ నుండి వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు.అందుకే ఈయన కాస్త వెనుక పడ్డారు. అయితే ఒకప్పటి కృష్ణవంశీని గుర్తుచేస్తూ ఆయన ‘రంగ మార్తాండ’ సినిమా చేశారు. ఇది ‘నట సామ్రాట్’ అనే చిత్రానికి రీమేక్. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది జనాలకు కృష్ణవంశీ ప్రీమియర్స్ వేశారు. ఒరిజినల్ ను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అలాగే తెలుగు నేటివిటీని మిస్ చేయకుండా ‘రంగమార్తాండ’ చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించారు కృష్ణవంశీ.
మార్చి 22న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఆరోజున ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు ఓ మంచి సినిమా చూశాం అనే సంతృప్తితో థియేటర్ నుండి బయటకు వస్తారు. ఆ ధైర్యంతోనే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది. అలాగే ప్రఖ్యాత అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఫ్యాన్సీ రేటు చెల్లించి మరీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది.
సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 4 లేదా 5 వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవకాశం ఉంది. ఈ సినిమా ప్రారంభించినప్పటి నుండి బడ్జెట్ సమస్యలు కూడా ఎదురయ్యాయి. అయితే ఓటీటీ హక్కులతోనే ఈ మూవీ 90 శాతం రికవరీ సాధించినట్టు వినికిడి.ఇంకా డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ మిగిలే ఉన్నాయి. సినిమా సక్సెస్ అయితే అటు థియేట్రికల్ పరంగా ఇటు నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా మరింత లాభాలను ఈ మూవీ నిర్మాతలకు అందిస్తుంది అనడంలో సందేహం లేదు.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్