‘ఉప్పెన’ కొండపొలం’ వంటి చిత్రాల అనంతరం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ గా రీమేక్ చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈరోజు అంటే సెప్టెంబర్ 2న ఈ మూవీ రిలీజ్ కానుంది.
టీజర్, రెండు పాటలు వంటివి సినిమా పై బజ్ ఏర్పడేలా చేశాయి. ఓవర్సీస్ ఆల్రెడీ ఈ చిత్రం ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం.. కథేమీ కొత్తగా లేదట. ఈ చిత్రం చూస్తున్నంత సేపు ‘ఖుషి’ ‘100% లవ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఇలా చాలా చిత్రాలు గుర్తుకొస్తాయట. ‘ఇగో’ అనే పాయింట్ చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుందని వారు చెబుతున్నారు.
అయితే రెండు పాటలు చూడటానికి బాగున్నాయట. అలాగే యూత్ ను ఆకట్టుకునే కొన్ని అంశాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. నేపధ్య సంగీతం పరంగా దేవి శ్రీ ప్రసాద్ మరోసారి నిరాశపరిచాడని కంప్లైంట్ చేస్తున్నారు ఓవర్సీస్ ఆడియన్స్.అయితే వైష్ణవ్ తేజ్ మరోసారి డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెబుతున్నారు.
కచ్చితంగా చూడాల్సిన సినిమా అయితే కాదు కానీ.. వీకెండ్ మూవీ లవర్స్, టైం పాస్ కోసం సినిమా చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చని ఓవర్సీస్ ప్రేక్షకులు చెబుతున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి..!
Started with a Mediocre Outdated Story With a Vexing screenplay🤦🏻♂️🤦🏻♂️, Turned to Lackluster TV serial with Ultra bad Dialouges, poor editing👎🏻 and Jump cuts.