Vaisshnav Tej: అమ్మాయి ట్రీట్ ఇవ్వాలంటే ఏమీ తీసుకురావాల్సిన పని లేదు!

  • January 24, 2022 / 01:34 PM IST

మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటి సినిమాతో అత్యదిక స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న హీరోగా వైష్ణవ్ తేజ్ ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇక ఆ తరువాత వచ్చిన కొండపొలం సినిమా మాత్రం డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఫోకస్ మొత్తం అతని మూడవ సినిమాపై పడేలా చేస్తున్నాడు.

ఉప్పెన విడుదల కంటే ముందే శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో వైష్ణవ్ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక తమిళ్ అర్జున్ రెడ్డి రీమేక్ ను తెరకెక్కించిన గిరిషయా ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. నేడు సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో వైష్ణవ్ కు జోడిగా కేతికా శర్మ నటిస్తోంది. ఇక సినిమా క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

‘రంగరంగ వైభవంగా’ అనే టైటిల్ ను ఖరారు చేసిన చిత్ర యూనిట్ సభ్యులు రెండు పాత్రల నడుమ అందమైన సన్నివేశంను కూడా హైలెట్ చేశారు. అమ్మాయి ట్రీట్ ఇవ్వాలి అంటే ఏమి తీసుకు రావాల్సిన అవసరం లేదు అంటూ.. భటర్ ఫ్లై కిస్ తెలుసా? అని కేతికా క్యూట్ డైలాగ్స్ తో ఎట్రాక్ట్ చేసింది. కను రెప్పలతో ముద్దాడుతున్నట్లుగా ఉన్న ఆ భటర్ ఫ్లై కిస్ విజువల్స్ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి.

సినిమా క్యూట్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులకు ముందుకు రానుందట. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే వీరి కలయికలో వచ్చిన ఉప్పెన బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే తెలియజేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మరి వైష్ణవ్ తేజ్ మూడవ సినిమాతో ఎలాంటి వినాయన్ని అందుకుంటాడో చూడాలి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!


చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus