క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగారు. అయితే స్టార్ డైరెక్టర్స్ లో కృష్ణవంశీ శైలి వేరు అనే చెప్పాలి. ఎందుకంటే ఈయన సినిమాల్లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండే సన్నివేశాలు ఉండవు. వచ్చివెళ్లిపోవాలి అన్నట్టు హీరోయిన్లు, పాటలు రావు, ఫైట్స్ కూడా ఎమోషన్ తో ముడిపెడతాడు. అలాగే ఓ సామాజిక అంశాన్ని కూడా టచ్ చేయడం కృష్ణవంశీ కి అలవాటు. ఇదిలా ఉండగా..
ఇక కృష్ణవంశీ పని అయిపోయింది అన్న వాళ్ళకు.. రంగమార్తాండ రూపంలో గట్టి సమాధానమే చెప్పబోతున్నాడు అని కోడై కూస్తోంది.ఈ చిత్రాన్ని అతి కష్టం మీద పూర్తి చేశాడు కృష్ణ వంశీ. కోవిడ్ వచ్చింది. బడ్జెట్ సమస్యలు తలెత్తాయి. సినిమా మధ్యలో ఆగిపోయింది. కిందా మీదా పడి రంగమార్తాండ ని పూర్తిచేశాడు కృష్ణవంశీ. ఉగాది కానుకగా మార్చ్ 22 న ఈ మూవీ విడుదలకానుంది. ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి. వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది.
నిజానికి రంగమార్తాండ కంటే ముందుగా అన్నం అనే చిత్రం చేయబోతున్నట్టు కృష్ణవంశీ అనౌన్స్ చేశాడు. ఫుడ్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉంటుంది. అయితే కృష్ణవంశీ ఫాంలో లేకపోవడంతో మిడ్ రేంజ్ హీరోలు కూడా ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. నిర్మాతలైతే ముందుగానే సైడ్ అయిపోయారు. అయితే రంగమార్తాండ చిత్రాన్ని చూసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి ముందుకొచ్చిన మైత్రి సంస్థ . అన్నం చిత్రాన్ని కూడా నిర్మించడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.
మైత్రి సంస్థ ఓ పక్క పెద్ద సినిమాలను నిర్మిస్తుండటంతో పాటు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి సీనియర్ స్టార్ దర్శకుడు అయిన కృష్ణవంశీ తో సినిమా చేయడానికి వారు రెడీ అవ్వడం పెద్ద రిస్క్ అయితే కాదు. కాకపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో చేయడానికి పెద్ద లేదా మిడ్ రేంజ్ హీరోలు రెడీ అవ్వాలి అంటే రంగమార్తాండ థియేటర్లలో కూడా సక్సెస్ అవ్వాలి.