Rangamarthanda Teaser: ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కిన ‘రంగమార్తాండ’ టీజర్ ఎలా ఉందంటే..!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలకు ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లోనూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.. ఎందుకంటే ఆయన సినిమాల్లో సహజత్వం ఉంటుంది.. భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తుంటారు.. సినిమా చూసిన తర్వాత థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా… కథ, క్యారెక్టర్లు, ఎమోషన్స్ ఆడియన్స్‌ని వెంటాడుతూ ఉంటాయి.. ‘నిన్నే పెళ్లాడతా’, ‘మురారి’, ‘చందమామ’ వంటి ఫ్యామిలీ సినిమాలు తీసినా..’గులాబీ’, ‘సింధూరం’, ‘అంతఃపురం’ వంటి వైవిధ్యమైభరితమైన సినిమాలు చేసినా… ‘రాఖీ’ ‘చక్రం’ వంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా కానీ తన మార్క్ అయితే మిస్ కాలేదు..

అలాంటి ఆయన దగ్గరినుండి ‘గోవిందుడు అందరి వాడేలే’, ‘నక్షత్రం’ వంటి ఔట్ డేటెడ్ సినిమాలు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు.. దాంతో కాస్త వెనుక పడ్డారు.. అయితే ఒకప్పటి కృష్ణవంశీని గుర్తు చేస్తూ కొంత సమయం తీసుకుని ‘రంగ మార్తాండ’ సినిమా చేశారు.. మరాఠీలో మంచి ఆదరణ పొందిన ‘నట సామ్రాట్’ అనే చిత్రానికి రీమేక్ ఇది.. ఒరిజినల్‌ను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అలాగే తెలుగు నేటివిటీని మిస్ చేయకుండా ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్తున్నారు..

బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా.. మధు, వెంకట్ రెడ్డి నిర్మించారు.. ‘మాస్ట్రో’ ఇళయరాజా సంగీతమందించారు.. గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వారికి ‘రంగమార్తాండ’ ప్రివ్యూలు వేస్తూ.. వారి ఫీడ్ బ్యాక్ విని హ్యాపీగా ఫీలవుతున్నారు కృష్ణవంశీ.. ఎట్టకేలకు ఉగాది కానుకగా మార్చి 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం టీజర్ విడుదల చేశారు..

పాత్రల పరిచయం, ముఖ్యంగా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌ని హైలెట్ చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో టీజర్ కట్ చేశారు.. బ్రహ్మానందంని ఇలాంటి సీరియస్ పాత్రలో ఎప్పుడూ చూడలేదు.. ఇక ప్రకాష్ రాజ్ మరోసారి తన వైవిధ్యభరితమైన నటనతో ఆకట్టుకోబోతున్నారనిపిస్తుంది.. రమ్యకృష్ణను కూడా ఎమోషనల్‌గా చూపించారు.. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అని, మనసుల్ని హత్తుకునే ఎమోషన్స్ ఉన్నాయని ప్రివ్యూ చూసిన వారంతా చెప్తున్నారు.. ‘రంగమార్తాండ’ తనకు పూర్య వైభవాన్ని తీసుకొచ్చే సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు కృష్ణవంశీ..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus