క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. ‘నటసామ్రాట్’ మరాఠీలో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీన్ని తెలుగులో తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలో తన భార్య రమ్యకృష్ణకి ముఖ్య పాత్ర ఇచ్చారు కృష్ణవంశీ. ఈమెతో పాటు ప్రకాష్ రాజ్, నానా పటేకర్, బ్రహ్మానందం వంటి సీనియర్ స్టార్లు ఈ సినిమాలో కనిపించనున్నారు. యాంకర్ అనసూయ, బిగ్ బాస్ విజేత రాహుల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ముందుగా ఈ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ.. తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇంకా థియేటర్లు ఓపెన్ చేయలేదు. యాభై శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు తెరవలేమని ఏపీ ఎగ్జిబిటర్లు చెప్పడంతో పాటు మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే డిసెంబర్, జనవరి వరకు థియేటర్లు ఓపెన్ అయ్యేలా లేవు. దీంతో ‘రంగమార్తాండ’ టీమ్ ఓటీటీలోత్తమ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఈ క్రమంలో నిర్మాతలు దర్శకుడిని ఒప్పించినట్లు సమాచారం. ఈ విషయంలో ప్రముఖ ఓటీటీ సంస్థతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికార ప్రకటన రానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సివుంది కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే ఆఖరి షెడ్యూల్ మొదలుపెట్టి సినిమాని పూర్తి చేయబోతున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!