మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈసారి గట్టిగా కొట్టాడు. విమర్శించేవాళ్లంతా అభినందించేలా నటించారు. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేసిన రంగస్థలం నిన్న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రామచరణ్, సమంతల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య అనుబంధం.. ఆనాటి కాలంలో ఎన్నికల నేపథ్యంలో సాగే గొడవలను సుకుమార్ కళ్లకు కట్టారు. విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. విదేశాల్లోనూ రంగస్థలం మంచి వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. 28 కోట్ల షేర్ రాబట్టి మెగా హీరో సత్తాని చాటింది. తొలి రోజు రంగస్థలం సాధించిన కలక్షన్స్ ఏరియాల వారీగా (కోట్లలో)…
ఏరియా – షేర్ – గ్రాస్ నైజాం : 4.43 7 ఉత్తరాంధ్ర : 2.43 తూర్పు గోదావరి : 2.03 పశ్చిమ గోదావరి :1.60 కృష్ణ : 1.55 గుంటూరు : 3.15 నెల్లూరు : 0.75 (ఆంధ్ర మొత్తం :11 .51 – 16 .9 ) సీడెడ్ : 3.55 – 4 .4 రెండు రాష్ట్రాల్లో మొత్తం : 19.49 – 28 .3 అమెరికా : 4 .92 – 8 .2 కర్ణాటక : 2 .15 – 3 .5 ఇతర ప్రాంతాల్లో : 1 .80 – 3 .8 ప్రపంచవ్యాప్తంగా : 28 .36 – 43 .8