ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. “రంగస్థలం 1985 ” అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్రామీణ యువకుడిగా చెర్రీ కనిపించబోతున్నారు. టైటిల్ ల్లోనే ఇది పాతికేళ్ల నాటి కథ అని స్పష్టం చేశారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా రెండు షెడ్యూళ్లు రాజమండ్రి, రాజమహేంద్రవరం పరిసరాల్లో జరిగింది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేసిన భారీ గ్రామీణ సెట్ లో జరుగుతోంది. చరణ్, సమంతలపై ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు జరిగే షూటింగుతో టాకీ పార్టు పూర్తి కానుంది.
ఇక రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ రెండు పాటలు కూడా గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించాలి. గోదావరి జిల్లాల్లో ఈ పాటలను తెరకెక్కించాలని సుకుమార్ డిసైడ్ అయ్యారు. అందుకే త్వరలోనే పల్లెటూరు కి రంగస్థలం చిత్ర బృందం పల్లెటూరు కి పయనం కానుంది. జగపతి బాబు, అది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నా ఈ చిత్రంపై క్రేజ్ నెలకొని ఉంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ మార్చిలో థియేటర్లోకి రానుంది.