మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, యలమంచిలి రవిశంకర్; సి.వి.ఎం(మోహన్) నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా మార్చి 30న విడుదలవుతుంది. సినిమాకు సంబంధించిన ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. సుకుమార్ మాట్లాడుతూ అలగే సినిమాలో సర్‌ప్రైజ్ సాంగ్‌ను సినిమాలో చూడొచ్చు. ఆ సాంగ్‌ను చంద్రబోస్‌గారు పాడారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఆ కాలం నుండి వచ్చిన వ్యక్తులను సినిమా అలరిస్తుంది. మిస్ అయిన జనరేషన్‌ను ఈ జనరేరషన్‌లో చూడొచ్చు. మంచి టెక్నీషియన్స్ దొరకడం వల్ల నా వర్క్ సులభమైంది. ముఖ్యంగా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మోనికగారు 1980 బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ను చక్కగా చేశారు. సినిమాలో రంగమ్మ మంగమ్మ పాటలో ఉపయోగించిన గొల్లబామ అనే పదం ఓ కీటకానికి సంబంధించింది. ఎవరినీ ఎదో అనాలని చేయలేదు. నేను తొలి సినిమాలోఐటెమ్ సాంగ్ పెట్టినప్పుడు అది పెద్ద సక్సెస్ అయ్యింది. అక్కడ నుండి ఐటెమ్‌సాంగ్స్ కంపల్సరీగా పెట్టాల్సి వస్తుంది. నవీన్‌గారికి కూడా ఐటెమ్ సాంగ్స్ అంటే ఇష్టం. ఆయనకు ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ వినిపించాను. నిర్మాతలకు నచ్చడంతో.. ఐటెమ్ సాంగ్‌ను పెట్టాను” అన్నారు.