సినిమా సెలబ్రిటీ – బిజినెస్ మేన్, సినిమా సెలబ్రిటీ – స్పోర్ట్స్ ప్లేయర్.. ఇలాంటి కాంబినేషన్‌లు తరచూ మనం సినిమా పరిశ్రమలో చూస్తుంటాం. ఇలా కనిపించే మరో కాంబినేషన్, బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపించే కాంబినేషన్ అంటే ‘సినిమా సెలబ్రిటీ – సినిమా సెలబ్రిటీ’. ఈ కాంబినేషన్ చాలా ఏళ్లుగా బాలీవుడ్‌లో ఉంది. ఇప్పుడూ కనిపిస్తోంది. అలాంటి ఓ జంట ప్రముఖ స్టార్ట్స్ రణ్‌వీర్ సింగ్ – దీపికా పడుకొణె. వీరి ప్రేమ గురించి ఇప్పుడు, అప్పుడు చాలామందికి తెలిసినా.. ప్రేమకథ మాత్రం పెద్దగా తెలియదు. రీసెంట్‌గా దాని గురించి మాట్లాడారు ఇద్దరూ.
నేను మీ అందరికీ ఒక ఆసక్తికర విషయం చెప్పాలనుకుంటున్నాను అంటూ రణ్‌వీర్ సింగ్ తన ప్రేమకథను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం సెలబ్రిటీల వెడ్డింగ్‌తో ఉదయపుర్ కోట గురించి సోషల్ మీడియాలో, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి కారణం ఆంధ్రప్రదశ్‌కి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ మంతెన రామరాజు తనయ నేత్ర వివాహం అక్కడ జరగడమే. విదేశీ సెలబ్రిటీలు, స్వదేశీ సెలబ్రిటీల రాక ఆ పెళ్లి మరింత ఘనంగా, వైరల్‌గా మారింది. ఆ వివాహానికి వచ్చిన రణ్‌వీర్ సింగ్ ఆ ప్లేస్‌తో తమ జంటకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.
ఉదయ్‌పూర్ కోట ఎన్నో ప్రేమకథలకు ఆరంభం. నేను, దీపిక నటించిన ‘రామ్ లీల’ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇక్కడే జరిగింది. ఆ చిత్రీకరణ సమయంలోనే మా ప్రేమ వికసించింది. ఆ తర్వాత కొన్నేళ్ల సహజీవనం చేశాం. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం అని చెప్పాడు రణ్‌వీర్. ప్రేమ, పెళ్లి ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు. మా వివాహమై ఏడేళ్లవుతోంది. మా ప్రేమకు కానుకగా దువా పుట్టింది. ఉదయపుర్ నా జీవితంలో ఎంతో అదృష్టాన్నిచ్చింది. నాలాగే ఎంతోమంది జీవితాల్లో ఈ ఊరు ఆనందాన్ని నింపింది అని రణ్‌వీర్ చెప్పాడు. ‘రామ్ లీలా’ కోసం దీపిక, రణ్‌వీర్ తొలిసారి కలసి పని చేశారు. 2018లో వివాహం జరగింది. గతేడాది వీరికి పాప పుట్టింది.