రేపు “రారండోయ్ వేడుక చూద్దాం” ఆడియో వేడుక
- May 20, 2017 / 01:48 PM ISTByFilmy Focus
మన సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, ఆత్మీయతలను “రారండోయ్ వేడుక చూద్దాం” మూవీ ద్వారా మరో మారు వెండి తెరపై ఆవిష్కరించనున్నారు. సోగ్గాడే చిన్నినాయనా తర్వాత కల్యాణ్ కృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్స్ గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటల వేడుకను గురువారం నిర్వహించాలని చిత్ర బృందం భావించింది.
అయితే ఆరోజు నాగార్జున సోదరి అయిన నాగసుశీల భర్త అనుమోలు సత్యభూషణ్‌రావు మరణించడంతో వేడుకను వాయిదా వేశారు. ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని రేపు (మే 21 ) సాయంత్రం నిర్వహిస్తున్నట్లు చిత్ర బృందం కొన్ని నిముషాల క్రితం ప్రకటించింది. జగపతి బాబు, సంపత్, వెన్నెల కిషోర్, పృద్విరాజ్, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ మూవీ ఈనెల 26 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













