తండ్రి ఓ స్టార్ హీరో అయినప్పటికీ కేవలం కమర్షియల్ సినిమాలకి మాత్రమే ఇరుక్కుపోకుండా తనకంటూ ఓ కొత్త ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున. అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకతని ఏర్పరుచుకుని స్టార్ హీరోగా ఎదిగాడు మన కింగ్. 1986లో ‘విక్రమ్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆ చిత్రంతో హిట్టయితే అందుకోలేయకపోయాడు. ఇక అదే సంవత్సరం చేసిన ‘కెప్టెన్ నాగార్జున’ ‘అరణ్యకాండ’ వంటి చిత్రాలు కూడా ప్లాపయ్యాయి. ఓ పెద్ద ఫ్యామిలీ నుండీ వచ్చినా కూడా… చేసిన మూడు సినిమాలు ప్లాప్ అవ్వడంతో ప్రేక్షకులంతా షాకయ్యారు.
ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న నాగార్జునకి ‘మజ్ను’ చిత్రం ఆ లోటును తీర్చింది. 1987 లో దర్శకరత్న దాసరి నారాయణ రావు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నాగార్జున చిత్రాల్లో ఇది ఒక క్లాసిక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రంలో ‘ప్రేయసి రావే’ పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. ఇక ఈ చిత్రంతో హిట్టందుకున్న నాగార్జున అదే జోష్ లో సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగించాడు. చాలా హిట్లందుకున్నాడు కూడా. ఇక ఇదే క్రమంలో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రంతో మళ్ళీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్టవ్వడమే కాదు… ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. ‘గీతాంజలి’ 1989 లో వచ్చినప్పటికీ 2000 సంవత్సరం తర్వాత పుట్టినవాళ్ళకి కూడా ఈ చిత్రం హాట్ ఫేవరెట్ అంటే ఆ సినిమా క్రేజ్… అలాగే నాగార్జున టేస్ట్ ఏంటనేది స్పష్టమవుతుంది.
ఇక అదే ఏడాది వచ్చిన ‘శివ’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఓ ‘గేమ్ చేంజర్’ మూవీ. ఇక ఇదే క్రమంలో ‘వారసుడు’ ‘అల్లరి అల్లుడు’ ‘హలో బ్రదర్’ వంటి సూపర్ హిట్లతో దూసుకుపోయాడు. ప్రేమ కథా చిత్రాలైనా.. యాక్షన్ చిత్రాలైనా… ఫ్యామిలీ చిత్రాలైన ఎటువంటి చిత్రమైనా తన నటన గ్లామర్ తో మేజిక్ చేస్తూ వచ్చాడు నాగార్జున. అక్కడితో ఆగిపోలేదు ‘అన్నమయ్య’ ‘శ్రీరామదాసు’ ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి భక్తి చిత్రాల్లో కూడా నటించి శభాష్ అనిపించుకున్నాడు నాగార్జున. ‘అన్నమయ్య’ చిత్రానికి స్పెషల్ జ్యూరి కేటగిరీ లో నేషనల్ అవార్డు అందుకున్నాడు నాగ్. ‘నువ్వు వస్తావని’ ‘సంతోషం’ ‘మన్మధుడు’ వంటి ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ తో నాగ్ ఇప్పటికీ సందడి చేస్తూనే ఉన్నాడు. ఇక ‘మాస్’ ‘మనం’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘ఊపిరి’ వంటి చిత్రాలు నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కేవలం సినిమాల దగ్గరే ఆగిపోలేదు.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో కి హోస్ట్ గా చేసి శభాష్ అనిపించుకున్న నాగార్జున… ‘బిగ్ బాస్3’ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఆయన రేర్ ఫోటోలను కొన్ని చూద్దాం రండి.