Shruti Hassan: మెగా హీరోల వల్ల శృతి ఖాతాలో ఆ రికార్డ్ చేరనుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. చిరంజీవి, చరణ్ వరుస సినిమాలలో నటిస్తూ ఆ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నారు. చిరంజీవి, కాజల్ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ ఖైదీ నంబర్ 150 సినిమాలో నటించగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అయితే మెగా ఫ్యామిలీ హీరోలతో కాజల్ నటించి సంక్రాంతి కానుకగా విడుదలైన నాయక్, ఖైదీ నంబర్ 150 సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తండ్రీకొడుకులతో నటించి ఆ సినిమాలు సంక్రాంతికి విడుదలై విజయాలను సొంతం చేసుకున్న హీరోయిన్లలో కాజల్ ఒకరు. అయితే శృతి హాసన్ ఖాతాలో కూడా ఈ రేర్ రికార్డ్ చేరే అవకాశం అయితే ఉంది. చరణ్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఎవడు సినిమా 2014 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

చిరంజీవికి జోడీగా శృతి హాసన్ వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. తండ్రీకొడుకులతో కాజల్ లా శృతి కూడా పొంగల్ విజయాలను ఖాతాలో వేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ప్రభాస్, బాలయ్య, చిరంజీవిలకు జోడీగా నటిస్తున్నారు. గతేడాది క్రాక్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న శృతి హాసన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. శృతి హాసన్ తర్వాత ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus