RRR Movie: ఆర్ఆర్ఆర్ హవా ఇప్పట్లో ఆగేలా లేదుగా?

ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో విడుదలై దాదాపుగా 70 రోజులైంది. 2020 సంవత్సరంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా, ఇతర కారణాల వల్ల రిలీజ్ డేట్లను మార్చుకుంటూ ఆలస్యంగా థియేటర్లలో రిలీజ్ కావడం గమనార్హం. ప్రస్తుతం సౌత్ రాష్ట్రాల ప్రేక్షకులకు జీ5 యాప్ లో హిందీ, ఇతర దేశాల ప్రేక్షకులకు నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ అందుబాటులో ఉంది. అటు జీ5 ఇటు నెట్ ఫ్లిక్స్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు.

అయితే ఓటీటీలో కూడా ఈ సినిమా హవా కొనసాగుతోంది. డాక్టర్ స్ట్రేంజ్ కు రచయితగా పని చేసిన రాబర్ట్ కార్గిల్ ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన సినిమాను గతంలో చూడలేదని ఈ వీకెండ్ లో వైఫ్ తో కలిసి ఈ సినిమాను మళ్లీ చూస్తానని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ కు ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. అమెరికాలో కొన్నిరోజుల క్రితం ఆర్ఆర్ఆర్ రీరిలీజ్ ప్రీమియర్లు వేశారనే సంగతి తెలిసిందే.

మొదట నాలుగు ఐదు షోలు ప్రదర్శించాలని భావించగా ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో షోల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది. గతంలో ఏ సౌత్ సినిమాకు రాని స్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమాకు స్పందన దక్కుతోంది. థియేటర్లలో ఆర్ఆర్ఆర్ 2,000 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించలేకపోయినా ఓటీటీలో ఊహించని రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా సక్సెస్ అటు చరణ్, ఇటు ఎన్టీఆర్ కెరీర్ లకు కచ్చితంగా ప్లస్ అవుతుంది. జెన్యూన్ గా ఈ స్థాయిలో రెస్పాన్స్ దక్కిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. బుల్లితెరపై కూడా ఆర్ఆర్ఆర్ సంచలనాలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకుంటే ఈ హీరోలు పాన్ వరల్డ్ హీరోలుగా కెరీర్ ను కొనసాగించే అవకాశాలు అయితే ఉంటాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus