అందం, అభినయం, ఆకర్షణ… టీవీ నటీమణులు అంటే ఇవే అనుకుంటుంటారు. కానీ వాళ్ల నవ్వుల వెనుకు బాధ, భయం, నిరాదరణ లాంటివి చాలానే ఉంటాయి. గతంలో కొన్ని సందర్భాల్లో వాళ్ల కెరీర్ ప్రారంభంలో, కెరీర్‌కి ముందు పడ్డ ఇబ్బందుల గురించి చెబుతూ వచ్చారు. జబర్దస్త్ టీవీ షోలో చేసే నటీమణులు విషయంలో ఇలాంటి మాటలు మనం కొన్ని విన్నాం. తాజా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో మరికొన్ని కన్నీటి గాధలు వినిపించాయి.
తండ్రి ప్రేమ అంటే ఏంటో తమకు తెలియదు అని కొందరు చెప్పగా, కొందరేమో ఆ ప్రేమ మాకు దూరమైంది అని చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఫాదర్స్ డే సందర్భంగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో ‘నాన్న నా హీరో’ అని ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్‌లో నటులు, నటీమణులు తండ్రి, కూతరుతో హాజరయ్యారు. తొలతు బుల్లెట్ భాస్కర్, నూకరాజు, గీతూ రాయల్ తదితరులు తమ తండ్రితో కలసి స్కిట్స్ వేసి నవ్వించారు.
ఆఖరున మరికొంతమంది మహిళా నటులు తమ జీవితంలో తండ్రి పాత్ర గురించి చెప్పే ప్రయత్నం చేశారు. నటి పవిత్ర మట్లాడుతూ ‘‘కొన్ని కారణాల వల్ల మా నాన్న బాగా తాగేవారు. ఆయన బతికున్నప్పుడు నేను ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదు. కనీసం ముట్టుకోలేదు కూడా. ఆయన చనిపోయిన తర్వాత కాళ్లకు మొక్కాను’’ అని చెప్పింది. ఆ తర్వాత రష్మి మాట్లాడుతూ ‘‘బ్యాడ్ పేరెంట్స్, గుడ్ పేరెంట్స్ ఉంటారా? లేదా? అనే విషయం నాకు తెలియదు.
నా ఫాదర్ నుండి నేను ఎప్పుడూ ఆప్యాయత చూడలేదు’’ అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లడంతో తన తల్లే తనను పెంచినట్టు గతంలో ఒకసారి చెప్పుకొచ్చింది రష్మీ. ‘‘ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా డాడీ లేని లోటు తీరదు. డాడీ లేకపోతే చాలా బాధగా ఉంటుంది’’ అని వర్ష కన్నీరు పెట్టుకుంది. ఆమెతోపాటు మరికొంతమంది నటులు ఈ షోలో ఫాదర్స్ డే జరుపుకున్నారు.
Most Recommended Video
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!