విజయ్ సినిమా పై రష్మిక ఫుల్ కాన్ఫిడెన్స్.. కారణం అదే..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెయిర్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇద్దరూ రియల్ లైఫ్ లో కూడా క్లోజ్ ఫ్రెండ్స్. విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కూడా రష్మికకు మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్ళిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వగా… ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో వీళ్ళ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉండగా.. విజయ్ – రష్మిక లు ఒకానొక సందర్భంలో ‘డేటింగ్ చేస్తున్నారు’, ‘పెళ్లి కూడా చేసుకోబోతున్నారు’.. అంటూ ప్రచారం జరిగింది.

కానీ ఆ వార్తలను ఇద్దరూ కొట్టిపారేశారు. మేము మంచి స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘లైగర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. దానికి రెస్పాన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా యూత్ కు ఈ ఫస్ట్ లుక్ బాగా నచ్చేసింది. ఈ చిత్రంలో విజయ్.. కిక్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ఫస్ట్ లుక్.. రష్మిక కు విపరీతంగా నచ్చేసిందట.

అందుకే ‘ఈ మాస్టర్ పీస్ ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురుచూస్తున్నా, థియేటర్లో డాన్స్, ఈలలు వేస్తా గ్యారెంటీగా’ అంటూ ట్వీట్ చేసింది. దానికి విజయ్ జవాభిస్తూ…. ‘నువ్వు ఆల్రెడీ సగం చూసావు. నీతో పాటు ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారులే’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘లైగర్’ చిత్రం షూటింగ్ 40శాతం ఫినిష్ అయ్యింది. అందులో సగం రష్మిక చూసేసింది కాబట్టే.. ‘లైగర్’ పై కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus