Rashmika: రష్మిక మందన్న శారీ – వైడ్ నెక్ టాప్, షార్ట్ డ్రెస్ కాస్ట్ ఏంతంటే..?

రష్మిక మందన్న.. కొద్ది కాలంగా ‘‘నేషనల్ క్రష్’’ కుర్రకారు మనసుల్ని దోచుకుంటున్న ఈ కన్నడ చిన్నది.. ముందుగా శాండల్ వుడ్‌‌లో ‘కిరాక్ పార్టీ’ (తెలుగులో ‘కిరాక్ పార్టీ) తో ఇంట్రడ్యూస్ అయింది. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకుడు కాగా.. రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. తర్వాత పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ‘అంజనిపుత్ర’, గోల్డెన్ స్టార్ గణేష్ ‘చమక్’ సినిమాలు చేసి.. ‘ఛలో’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది..

‘గీత గోవిందం’, ‘దేవదాస్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘పుష్ప’, ‘సీతా రామం’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. మధ్యలో కన్నడలో.. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ‘యజమాన’, యాక్షన్ ప్రిన్స్ ధృవ్ సర్జా ‘పొగరు’ మాత్రమే చేసింది. తర్వాత కార్తి ‘సుల్తాన్’ మూవీతో కోలీవుడ్‌కి వెళ్లింది. రెండో సినిమాకే దళపతి విజయ్ పక్కన ‘వరిసు’ (వారసుడు) యాక్ట్ చేసింది.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ‘గుడ్ బై’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది.. ‘మిషన్ మజ్ను’ తర్వాత సందీప్ రెడ్డి వంగా.. రణ్ బీర్ కపూర్‌తో తీస్తున్న ‘యానిమల్’ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు.

ఇటీవల కలిసి రెండు సినిమాలు చేసిన విజయ్ దేవరకొండతో కొంతకాలంగా రిలేషన్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి.. అలాగే రష్మిక హీరోయిన్ అయిన తర్వాత ఐదు సంవత్సరాలలో.. హైదరాబాద్, గోవా, ముంబై, కూర్గ్, బెంగుళూరు ప్రాంతాల్లో ఖరీదైన అపార్ట్‌మెంట్స్ కొంది అనే న్యూస్ కూడా వైరల్ అవుతోంది.. రష్మిక ఫ్యాషన్ గురించి నెట్టింట కనిపిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం..

1) DEVNAAGRI – Baby Pink Embroidered Organza Saree – కాస్ట్ – రూ. 48,500/-

2) FABINDIA – Maroon Cotton Beaded Short Dress – కాస్ట్ – రూ. 2,399/-

3) Dolce & Gabbana – Lace – Detail Knitted Wide – Neck Top – రూ. 2,07,085/-

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus