Rashmika,Dhanush: రష్మిక తక్కువ రెమ్యుషనరేషన్ తీసుకోవడానికి కారణం అదేనా..!

పుష్ప సినిమా ఒవర్ నైట్ నేషనల్ క్రష్ అయిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం టాలీవుడ్ ముద్దుగుమ్మలు శ్రీ‌లీల‌, మృణాల్ ఠాకూర్ వంటి యంగ్ హీరోయిన్స్ ఎంతా పోటీ ఇస్తున్న తన క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో తన హవా కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ అందం చేతిలో మూడు భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం యావత్ దేశం మొత్తం ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ పుష్ప 2, ఒకటి.

దాని తర్వాత బాలీవుడ్ లవర్ బాయ్ ర‌ణ‌బీర్ క‌పూర్ సరసన యానిమల్ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా రష్మిక తన కెరీర్లోనే తొలిసారిగా చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ రెయిన్ బో ఉంది. వీటన్నింటితో పాటు తాజాగా రష్మిక మరో క్రేజీ ప్రాజెక్టుకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ అల్లుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఆమె జతకట్టబోతుంది. ధనుష్ ఇటీవలే సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.

సినిమా తర్వాత ఆయన క్లాసికల్స్ డైరక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంతో నేరుగా తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడు. శేఖర్ కమ్ముల కెరీర్లోనే తొలిసారిగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. ధనుష్ ఇప్పటికే 50సినిమాలు పూర్తి చేసుకున్నారు. ధనుష్ కెరీర్లో ఇది 51వ సినిమా. ధ‌నిక‌, పేద మ‌ధ్య అంత‌రాల‌ను చ‌ర్చిస్తూ పేరుమోసిన గ్యాంగ్‌స్టార్ క‌థాంశంలో ఈ సినిమా క‌థాంశం ఉండనుంది. అయితే త్వరలోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలు కానుంది.

ఇందులో ధనుష్ కు జోడీగా (Rashmika) ర‌ష్మిక మంద‌న్నాను ఎంపిక చేశారు. అయితే పాన్ ఇండియా హీరోయిన్ అయిన రష్మిక ఈ సినిమాను చాలా తక్కువ రెమ్యునరేషన్ కే ఒప్పుకుందట. నిజానికి రష్మిక ఓ సినిమా చేస్తే అందుకు దాదాపు రూ.3.5కోట్ల నుంచి 4కోట్లు వసూలు చేస్తుంది. కానీ ఈ చిత్రానికి రూ. 2 కోట్లే తీసుకుంటుందట. టాలీవుడ్ లో ప్రస్తుత యంగ్ బ్యూటీల మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉంది. అందుకే మొదట నాలుగు కోట్లు డిమాండ్ చేసినా మేకర్స్ ససేమీరా అనేసరికి రెండు కోట్లకే ఓకే చెప్పేసిందట.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus