Rashmika: హాట్ టాపిక్ గా మారిన రష్మిక ఎమోషనల్ కామెంట్స్.!

రష్మిక మందన ఈ ఏడాది అప్పుడే ‘వారసుడు'(తమిళ్ లో ‘వరిసు’) చిత్రంతో ఓ హిట్ అందుకుంది రష్మిక. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ , సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప2’ వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. మరోపక్క విజయ్ దేవరకొండతో ప్రేమ వార్తలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. రష్మిక మందన ఇటీవల అభిమానులతో ముచ్చటించింది. ‘రష్ అవర్’ అనే పేరుతో ఈ చాట్ సెషన్ ను నిర్వహించింది.

ఈ క్రమంలో అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. విజయ్ తో నెక్స్ట్ సినిమా ఎప్పుడు. తమిళంలో ఇంకో సినిమా చేస్తారా? ‘పుష్ప 2’ లో మీ పాత్ర ఎలా ఉంటుంది వంటి ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేశారు. అయితే ఓ నెటిజన్ ‘షిమాన్ ఎలా ఉంది. ఆమె ఏ క్లాస్ చదువుతుంది’ అంటూ ప్రశ్నించాడు. ఇందుకు రష్మిక సమాధానం ఇచ్చింది. ‘తనకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడల్లా చాలా మిస్ అవుతాను, చూస్తుండగానే ఎంతో పెద్దది అయిపోతోంది, ఇప్పుడు 4వ తరగతి నుంచి 5వ తరగతికి వెళ్తుంది.

ఇప్పుడు అయితే పరీక్షలు నడుస్తున్నాయని,కాబట్టి ‘అందరూ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పండి’ అంటూ కోరింది. రష్మిక చెల్లెలు గురించి ఆమె అభిమానులకు తప్ప మిగిలిన జనాలకు పెద్దగా తెలిసుండకపోవచ్చు. అభిమాని ట్వీట్ కు రష్మిక జవాబు ఇవ్వడం వలన ఆ పాప గురించి అందరికీ తెలిసినట్టయ్యింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus