‘సుల్తాన్’కి రష్మిక సెంటిమెంట్ కలిసొస్తుందా?

సిల్వర్ స్క్రీన్ మీద రష్మిక పెళ్లి అయితే సినిమా సూపర్ హిట్. టాలీవుడ్ కి కన్నడ బామ్మ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన సినిమా ‘ఛలో’. అందులో క్లైమాక్స్ లో నాగశౌర్యతో రష్మిక పెళ్లి అవుతుంది‌. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అప్పటి వరకు శౌర్య కెరీర్ లో హిట్స్ తో కంపేర్ చేస్తే ‘ఛలో’ బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం ‘గీత గోవిందం’.

ఆ సినిమా కూడా సూపర్ హిట్. ‘అర్జున్ రెడ్డి’ తరువాత ‘నోట’, ‘టాక్సీవాలా’ సినిమాలతో సాలిడ్ హిట్ అందుకోవాలని ఆశించి భంగపడిన విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’తో 100 కోట్ల విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘ఛలో’, ‘గీత గోవిందం’… రెండు సినిమాల క్లైమాక్స్ లో రష్మికకు పెళ్లి అయ్యింది. రెండు సినిమాలు హిట్లు అయ్యాయి. ఇప్పుడు తమిళ హీరో కార్తీ కి జంటగా రష్మిక నటిస్తున్న సినిమా ‘సుల్తాన్’. షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫోటో చూస్తే ఈ సినిమా క్లైమాక్స్ లో కార్తీతో రష్మిక పెళ్లి అయ్యిందని ఊహించవచ్చు. ‘ఖైదీ’తో హిట్ అందుకున్న కార్తీకి ‘దొంగ’తో ఫ్లాప్ వచ్చింది. రష్మిక పెళ్లి సెంటిమెంట్ కలిసొచ్చి ‘సుల్తాన్’ సూపర్ సక్సెస్ సాధిస్తుందని ఏమో చూడాలి.


Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus