Ravi Teja, Rashmika: రవితేజ సినిమాలో నేషనల్‌ క్రష్‌… ఏ ప్రాజెక్ట్‌లో అంటే?

రవితేజను ప్రస్తుతం తరం హీరోల్లో పవర్‌ హౌస్‌ అంటుంటారు. వయసు అనే కాన్సెప్ట్‌నే ఆయన మరచిపోతారు అని చెబుతుంటారు. ఇటీవల వచ్చిన ‘ధమాకా’ సినిమాలో యువ కథానాయిక శ్రీలీలకు సమానంగా డ్యాన్స్‌లు, యాక్టింగ్‌ చేసి అదరగొట్టాడు. ఇప్పుడు కొత్త సినిమా కోసం అలాంటి రవితేజకు ఇప్పుడు హీరోయిన్లలో పవర్‌ హౌస్‌ అనే పేరున్న రష్మిక మందనను పెయిర్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దీని గురించే చర్చ.. రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.

రవితేజ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ అయిన ‘క్రాక్‌’ సినిమా తర్వాత ఆ ఇద్దరూ కలసి చేస్తున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా తొలుత శ్రీలీల పేరు వినిపించింది. అయితే తాజాగా రష్మిక మందన కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే రెండు పవర్‌ హౌస్‌ల ఢీని మనం వెండితెరపై చూడొచ్చు. ఇక ప్రస్తుతం రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

ఆ తర్వాత దసరా సందర్భంగా గోపీచంద్‌ మలినేని సినిమా ప్రారంభమవుతుంది అంటున్నారు. ఈ లోపు కథానాయిక విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నారు. తొలుత అనుకున్న శ్రీలీలను ఎంపిక చేస్తారా? లేక రష్మిక మందనను ఓకే చేస్తారా అనేది చూడాలి. లేక కొత్త హీరోయిన్‌ ఏమైనా మళ్లీ చర్చలోకి వస్తుందా అనేది కూడా తెలియాలి. అలాగే ఇటీవల కాలంలో రష్మిక బాలీవుడ్‌కి వెళ్లిపోవడంతో ఆమె ఛాన్స్‌లు అన్నీ శ్రీలీల కొట్టేస్తోంది, సాధించేస్తోంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి.

ఇప్పుడు ఈ సినిమా ఓకే అయితే శ్రీలీల ఛాన్స్‌ను రష్మిక సంపాదించింది అని అంటారేమో. అలాగే నేషనల్‌ క్రష్‌ టాలీవుడ్‌కి దూరమవుతోంది అంటూ వస్తున్న పుకార్లకు కూడా ఈ సినిమాతో రష్మిక ఫుల్‌స్టాప్‌ పెట్టొచ్చు. అయితే ఈ సినిమాను ఓకే చేస్తే మరి నితిన్‌ – వెంకీ కుడుముల సినిమాను ఎందుకు వద్దనుకుందో రష్మిక (Rashmika) చెప్పాల్సి వస్తుంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus