Rashmika Mandanna: అభిమాని వల్ల ఎమోషనల్ అయిన రష్మిక..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ అయిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ మూవీలో నటిస్తున్న ఈ అమ్మడు మరో పక్క బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా..ఇటీవల రష్మిక ను కలిసేందుకు ఓ అభిమాని..కర్ణాటక వరకు వెళ్ళాడు. వివరాల్లోకి వెళితే..తెలంగాణకు చెందిన రష్మిక హార్డ్ కోర్ ఫ్యాన్ ఒకరు ఆమెను కలిసేందుకు ఏకంగా కర్ణాటకకు బయలుదేరి వెళ్ళాడు.

ఈ లాక్ డౌన్ టైంలో ఎలాగైనా ఆమెతో ఫోటో దిగాలని ఆశపడ్డాడు.ఈ క్రమంలో అతనికి చుక్కెదురు అయ్యింది. రష్మిక ఇంటి వరకు వెళ్లి.. ఆ ప్రదేశంలో ‘ఎలా ఆమెని కలవాలి’ అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్న ఆ వ్యక్తిని… అక్కడి స్థానికులు.. ‘ఈ ప్రదేశంలో అతను అనుమానంగా తిరుగుతున్నాడని ఆరోపిస్తూ’.. పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు అతనికి నచ్చ చెప్పి మళ్ళీ హైదరాబాద్ ట్రైన్ ఎక్కించి పంపేశారు. ఈ విషయం రష్మికకు ఆలస్యంగా తెలిసింది.

దీంతో ఆమె బాధపడుతూ సోషల్ మీడియాలో స్పందించింది. “ఈ పాండమిక్ టైం లో దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. నాకు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. అతన్ని కలవలేకపోయినందుకు చాలా బాధగా ఉంది.కానీ కచ్చితంగా భవిష్యత్తులో కలుస్తానని హామీ ఇస్తున్నా. అయితే అభిమానులకు నాదొక మనవి..మీరు ఇలాంటి రిస్క్ లు చేయడం కరెక్ట్ కాదు. మీరు క్షేమంగా ఉండాలి. మీరు ఇలా వందల కిలోమీటర్లు ప్రయాణం చేయడం శ్రేయస్కరం కాదు” అంటూ రష్మిక ఎమోషనల్ కామెంట్స్ చేసింది.


Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus