Rashmika Mandanna: రష్మిక తీరు పై నెటిజెన్ల సెటైర్లు..!

ప్రస్తుతం రష్మిక ముంబైలో ఉంటుంది. తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘మిషన్ మజ్ను’ ఆమె కొద్ది రోజుల నుండీ అక్కడే ఉంటూ వస్తుంది. అంతేకాదు గ్లామర్ ఫోటో షూట్లలో కూడా పాల్గొంటూ ఉంటుంది. మరో పక్క ఛాన్స్ దొరికినప్పుడల్లా.. తన స్నేహితుడు విజయ్ దేవరకొండ.. ‘లైగర్’ మూవీ సెట్స్ కి వెళ్ళిపోతుంది ఈ అమ్మడు. సరే ఇక అసలు విషయం ఏంటంటే.. నిన్న ముంబైలో ఓ సినిమా ఆఫీస్ కి వెళ్ళింది రష్మిక. అక్కడ ఆమె కారు దిగి క్యాజువల్ గా నడుస్తుంది..

కానీ ఇంతలో ఆమెకు మాస్క్ పెట్టుకోలేదన్న సంగతి గుర్తొచ్చినట్టుంది.వెంటనే మాస్క్ పెట్టుకుని అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ కు క్షమాపణ చెప్పింది. ‘మాస్క్ మరిచిపోయినందుకు క్షమించండి’ అంటూ వారిని వేడుకుంది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో రష్మిక పొట్టి డ్రెస్ లో కనిపిస్తుంది.కొద్దిరోజులుగా ఆమె పొట్టి డ్రెస్సులతోనే ఫోటో షూట్లు చేస్తుంది లెండి.

బాలీవుడ్ హీరోయిన్లు ట్రెండ్ ను ఈమె కూడా ఫాలో అవుతుంది. బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తుంది కాబట్టి అక్కడి కల్చర్ ను ఫాలో అవ్వాలి తప్పదు. అయితే ఈ వీడియోలో రష్మిక తీరు పై నెటిజన్లు… ‘నీ వస్త్రాలంకరణ పై ఉన్న శ్రద్ద కొంచెమైనా మాస్క్ పెట్టుకోవడం పై పెట్టుంటే బాగుంటుంది.. ఐ యాం టెల్లింగ్ థట్’ అంటూ ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus