Rashmika: రష్మిక ట్రోలింగ్‌కి భయపడిందా.. జెన్యూన్‌గా చెప్పిందా?

రష్మిక మందన ఒక మాట అంటే.. అందులో రెండు, మూడు కాంట్రవర్శీలు వస్తాయి. ఈ మాట మేం అనడం లేదు. ఆమెనే ఇటీవల ఓ ప్రమోషనల్‌ వీడియోలో చెప్పింది. అంతగా ఆమె మాటలు వైరల్‌ అయ్యి.. ఇబ్బంది పెడుతున్నాయి మరి. అయితే రష్మిక కాంట్రవర్శీల్లో కీలకమైంది, తొలి రోజుల్లో జరిగింది రక్షిత్‌ శెట్టి గురించే. ఆమె తొలి సినిమా గురించి చెబుతూ రక్షిత్‌ శెట్టి గురించి కానీ, ఆయన బ్యానర్‌ గురించి కానీ ప్రస్తావించలేదు ఓ ఇంటర్వ్యూలో.

దీంతో.. రక్షిత్‌ ఫ్యాన్స్‌, ప్రో శాండిల్‌ వుడ్‌ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యి నానా రచ్చ చేశారు. అయితే రష్మిక దీనికి బ్రేక్‌ వేసే ప్రయత్నం చేసింది. ఇటీవల రష్మిక ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ మళ్లీ నాటి రోజుల గురించి చెప్పింది. ఈ క్రమంలో గతంలోలా కాకుండా కాస్త జాగ్రత్తగా మాట్లాడింది అని చెప్పొచ్చు. రక్షిత్‌ శెట్టికి చెందిన పరంవా స్టూడియోస్‌ వల్లే తాను నటిగా మారాను అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది.

దీంతో ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘నేను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. అసలు అలా ఊహించుకోలేదు. అయితే సినిమా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. కొన్ని ఆడిషన్స్‌కు కూడా వెళ్లాను’’ అంటూ నాటి రోజుల్ని గుర్తు చేసుకుంది రష్మిక. అయితే ఆడిషన్స్‌లో ఫెయిలై నిరాశతో వెనక్కి వచ్చేసిందట. దీంతో నటన తనకు సెట్‌ కాదని, నటి అనే మాట తన జీవితంలో రాసి పెట్టి లేదని అనుకునేదట.

అలాంటి సమయంలో ఓ అందాల పోటీలో పాల్గొని టైటిల్‌ సొంతం చేసుకుంది రష్మిక. ఆ ఫొటోలు పేపర్‌లో చూసి పరంవా స్టూడియోస్‌ నుండి కాల్‌ వచ్చిందట. తమ కొత్త సినిమా ‘కిరిక్‌ పార్టీ’లో హీరోయిన్‌ రోల్‌ ఆఫర్‌ చేశారట. అలా నటిగా నా తొలి అడుగు కన్నడనాట పడింది అని రష్మిక చెప్పింది. అయితే గతంలో ఇంచుమించు ఇదే విషయాన్ని చెప్పబోతు..

ఓ స్టూడియో అంటూ రక్షిత్‌ శెట్టి పేరు చెప్పలేదు. దీంతో తీవ్రంగా ట్రోలింగ్‌కి గురైంది. ఆ భయమో, లేక చెబుదామని జ్ఞానోదయమో కానీ.. ఇప్పుడు పేరు చెప్పి మాట్లాడింది రష్మిక. ఈ మార్పు చూసి ఫ్యాన్స్‌ కూడా ఆనందపడుతున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus