టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక (Rashmika Mandanna) సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో ఒకరనే సంగతి తెలిసిందే. తెలుగులో పుష్ప2 సినిమాలో నటిస్తున్న రష్మిక ఇతర భాషల్లోని ప్రాజెక్ట్ లలో సైతం నటిస్తున్నారు. హీరోయిన్ గా తక్కువ సమయంలోనే రష్మిక ఊహించని రేంజ్ లో సక్సెస్ కాగా తన సక్సెస్ స్టోరీ గురించి రష్మిక షాకింగ్ కామెంట్లు చేశారు. తనకంటే అద్భుతంగా యాక్ట్ చేసేవాళ్లు, ప్రతిభ ఉన్నవాళ్లు ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
అయితే తనకు సినిమాలలో మంచి ఆఫర్లు రావడం వల్ల తాను సులువుగా సక్సెస్ సాధించడం సాధ్యమైందని రష్మిక చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తాను నిజంగా కృతజ్ఞతురాలినై ఉంటానని రష్మిక వెల్లడించారు. లైఫ్ లో సంతోషాన్ని మీరు పొందిన సక్సెస్ ను నార్మల్ గా భావించవద్దని ఆమె అన్నారు. గత కొంతకాలంగా తాను నేర్చుకున్నది ఇదేనని రష్మిక వెల్లడించడం గమనార్హం.
రష్మిక చేసిన కామెంట్లు నిజమేనని నెటిజన్లు చెబుతున్నారు. ఎంతోమంది హీరోయిన్ గా సక్సెస్ కావాలని ప్రయత్నించినా వేర్వేరు కారణాల వల్ల సక్సెస్ కాలేకపోతున్నారు. రష్మికకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటంతో భాషతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తున్నాయి. ఇతర హీరోయిన్లతో పోలిస్తే రష్మిక రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తం అని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ లో (Pushpa2) నా రోల్ మరింత బలంగా ఉంటుందని ఆమె తెలిపారు.
ఇప్పుడు శ్రీవల్లి 2.0ను చూస్తారని అది మాత్రమే చెప్పగలనని రష్మిక కామెంట్లు చేశారు. రష్మిక లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలు కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తాజాగా పుష్ప ది రూల్ నుంచి విడుదలైన రష్మిక లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. త్వరలో పుష్ప ది రూల్ సినిమా నుంచి మరిన్ని ఆసక్తికర అప్ డేట్స్ అయితే రానున్నాయని తెలుస్తోంది. పుష్ప ది రూల్ రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.