Rashmika: ‘పుష్ప’ మళ్లీ వస్తాడా? డిసెంబరు 4న క్లారిటీ వస్తుందా? అప్పటివరకు.!

  • December 2, 2024 / 01:24 PM IST

‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతోంది. సినిమా ఎంతటి భారీ విజయం అందుకుంటుంది అనే విషయం మరో మూడు రోజుల్లో తెలిసిపోతుంది. అదేంటి విజయం సాధిస్తుందో లేదో అని అనాలి కదా అనుకుంటున్నారా? మామూలుగా అయితే అలానే అనుకోవాలి. అయితే సినిమా తొలి భాగం ‘పుష్ప 1’  (Pushpa)  సాధించిన విజయం, రెండో భాగానికి జరుగుతున్న ప్రచారం, వస్తున్న హైప్‌ వల్ల విజయం పక్కా అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు కూడా సీక్వెల్‌ ఉంటుందా? అనే ప్రశ్న చాలా రోజులుగా వినిపిస్తూ వస్తోంది.

Rashmika

‘పుష్ప’రాజ్‌ కథ ఇక్కడితో ఆగదని.. ‘పుష్ప 3’ని కూడా తీసుకొస్తారని చాలా రోజులుగా వింటూనే ఉన్నాం. ఈ విషయంలో టీమ్‌ దగ్గర మాట్లాడుతుంటే ఉంటుంది అని అంటున్నారు, ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటున్నారు కానీ ఉంటుందా? లేదా? అనేది క్లారిటీగా చెప్పడం లేదు. ఇటీవల ఇదే విషయాన్ని సినిమా హీరోయిన్‌ రష్మిక మందన (Rashmika Mandanna)  దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానమే ఇచ్చింది.

కానీ పూర్తి క్లారిటీ రాలేదు. ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఎమోషనల్ అయింది రష్మిక. ఒకవేళ సినిమా ఇంకా ఉండి ఉంటే ఎందుకు ఎమోషనల్‌ అవ్వడం అనే డౌట్‌ అందరికీ వచ్చింది కూడా. అయితే ఆమెనే ‘పుష్ప 3’ సినిమా కూడా రావచ్చని హింట్ ఇచ్చింది. సినిమాకు సంబంధించి ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది. బహుశా పార్ట్ 3 కూడా ఉంటుంది అని రష్మిక చెప్పింది.

ఈ మాట విని బన్నీ (Allu Arjun) అభిమానులు సంతోషపడుతున్నారు. అయితే మూడో భాగం గురించి అల్లు అర్జున్ ఏమీ చెప్పలేదు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఏమీ చెప్పలేదు. దీంతో మూడో ‘పుష్ప’ హైప్‌ కోసం చేస్తున్న పనే అని అంటున్నారు. ఈ విషయం తేలాలి అంటే డిసెంబరు 5 వేకువజామున తేలిపోతుంది. ఎందుకంటే 4న రాత్రి వేసే షో అప్పుడే పూర్తవుతుంది కాబట్టి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus