Rashmika: మరోసారి పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన రష్మిక!

సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న ఒకరు ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె తరచూ అభిమానులతో ముచ్చటించడమే కాకుండా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే రష్మిక మరోసారి అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే నితిన్ సినిమా నుంచి రష్మిక తప్పకున్న సంగతి తెలిసిందే. డేట్స్ కారణంగా తప్పుకున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తల స్పందించిన ఈమె తాను ఎక్కడ అధికారికంగా చెప్పలేదని,

ఆ సినిమా విషయంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ కూడా ఆవాస్తవమని తెలియజేశారు. మరొక నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ మరోసారి ఈమె పెళ్లి గురించి ప్రశ్నలు వేశారు. ఇక ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ తనకి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు ఏ మాత్రం లేదని పెళ్లి చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది అంటూ సమాధానం చెప్పారు.

ఇక రష్మిక (Rashmika) సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె రణబీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాతో పాటు షాహిద్ కపూర్ అలాగే షారుఖ్ ఖాన్లతో కూడా సినిమాలకు కమిట్ అయ్యారు. ఇక తెలుగులో ఈమె అల్లు అర్జున్ సినిమాతో పాటు ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్గా అవకాశం అందుకొని కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus