Rashmika: ఆ హీరోతో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న రష్మిక?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి సక్సెస్ అందుకున్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా రష్మిక పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది. ఇటీవలే యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

ఇలా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అందరి హీరోలతో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక ఫేవరెట్ హీరో గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని ఆయన తన ఫేవరెట్ హీరో అంటూ ఈమె ఒక సందర్భంలో వెల్లడించారు.

ఎన్టీఆర్ నటన చాలా అద్భుతంగా ఉంటుందని ఆయన నటన చూస్తూ ఉంటే అలాగే ఉండిపోతానని రష్మిక తెలిపారు.. ముఖ్యంగా తారక్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ రష్మిక వెల్లడించారు ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం నేను కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ ఈమె తన మనసులో ఉన్నటువంటి మాటను బయట పెట్టారు.

ఈ విధంగా రష్మిక (Rashmika) తనకు ఎన్టీఆర్ అంటే ఇష్టమని తనతో సినిమా చేయడం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ఈమె తన మనసులో మాటను బయట పెట్టడంతో బహుశా ఈమె కోరికను ఏ దర్శకుడు నిర్మాత అయిన తీరుస్తారేమో చూడాలి. ప్రస్తుతం అయితే ఈమె పుష్ప 2 సినిమా షూటింగ్ పనులతో పాటు మరికొన్ని సినిమాలకు కమిట్ అవుతూ ఆ సినిమాలో షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus