Rashmika: ఈసారి రోమాన్స్ యానిమల్ ను మించి ఉండబోతుందా..!

అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’ బాలీవుడ్లో రణబీర్ కపూర్ ‘యానిమల్’ సినిమాలతో రష్మిక బిజీగా ఉంది. వీటితోపాటు సౌత్ లో ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న తర్వాత మొదటిసారి ఓ మీడియం రేంజ్ హీరోతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఆ మీడియం రేంజ్ హీరో ఎవరు? ఆ ప్రాజెక్టు ఏంటి? డీటెయిల్స్లోకి వెళ్తే.. ప్రస్తుతం టాలీవుడ్లో రష్మిక నటిస్తున్న ‘పుష్ప2’ షూటింగ్ దశలో ఉంది.

దీంతోపాటు రణబీర్ కపూర్కి జోడిగా నటించిన ‘యానిమల్’ విడుదలకు సిద్ధమవుతుండగా తాజాగా బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్టుకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోగా ఉన్న విక్కీ కౌశల్ సరసన రష్మిక నటిస్తోందట. ‘ఉరి’ మూవీతో బాలీవుడ్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ వస్తున్నాడు. రీసెంట్ గానే సారా అలీ ఖాన్తో కలిసి ‘జర హట్కే జర బచ్కే’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు.

ప్రస్తుతం విక్కీ కౌశల్ హీరోగా సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో ఓ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ తెరకెక్కనుంది. ‘చావా ది గ్రేట్ వారియర్’ అనే టైటిల్ తో ఈ మూవీని సిల్వర్ స్క్రీన్పై ప్రజెంట్ చేయబోతున్నారు. విక్కీ కౌశల్ కెరియర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం జయసింగ్ రావు రాసిన మరాఠీ నవల ఆధారంగా రూపొందుతోంది. రాహుల్ జనార్దన్ యాదవ్ ఈ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు.

ఇదే సినిమాలో ఫిమేల్ లీడ్గా (Rashmika) రష్మిక మందన నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటికే రష్మిక సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించగా ప్రస్తుతం రణబీర్ కపూర్ తో నటించిన ‘యానిమల్’ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పుడు విక్కీ కౌశల్ తో నటించబోతోంది. నిజానికి రష్మిక కి ఉన్న క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ లో విక్కీ కౌశల్ లాంటి మీడియం రేంజ్ హీరోతో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ ఒప్పుకోవడం విశేషం అని చెప్పాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus