Rashmika: వైరల్ అవుతున్నహీరోయిన్ రష్మీక మందాన్న కామెంట్స్

సినిమా హీరోయిన్ కావాలంటే ముందు అందం ఉండాలి. ఆ తర్వాత అదృష్టం ఉండాలి. వాటితో పాటు ఫర్ ఫెక్ట్ ఫిజిక్ ఉండాలి. ప్రస్తుతం ఇవే హీరోయిన్ కు కావాల్సినవి. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకోవాలి అన్నా.. వచ్చిన తర్వాత నాలుగేళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకుని అవకాశాలు అందుకొని.. వాటి ద్వారా స్టార్ హీరోయిన్ గా మారాలంటే కచ్చితంగా అందం చాలా ముఖ్యం. అందుకే చాలామంది హీరోయిన్స్ తమ అందాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడుతుంటారు.

శరీరానికి సంబంధించిన అన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎక్కడ కాంప్రమైస్ కాకుండా కడుపు మాడ్చుకొనైనా సరే ఇష్టమైన ఫుడ్ వదులుకుంటారు. ఇష్టం లేకపోయినా తింటూ బాడీని కరక్ట్ షేప్ లో మెయింటేన్ చేస్తుంటారు.కొంతమంది రోజుకి గంటలు గంటలు జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తుంటారు. తాజాగా రష్మిక మందన్నా.. జిమ్ లో చాలా కఠినంగా చేస్తున్న ఎక్స్ సర్సైజ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూస్తేనే రష్మిక అందం కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతుందో మనకు అర్థమయిపోతుంది . భారీ బరువులను ఎత్తుతూ వాటి వల్ల కలిగే ఆ నొప్పిని భరించలేక అరుస్తూ తనను తాను కంట్రోల్ చేసుకుంటుంది. దీంతో హీరోయిన్ అవ్వాలి అంటే కచ్చితంగా అలాంటి నొప్పులు భరించాల్సిందే అని.. అలాంటి నొప్పులు భరిస్తేనే స్టార్ హీరోయిన్ గా మారుతారు అంటూ రష్మిక (Rashmika) చెప్పకనే చెప్పింది. దీంతో ఇప్పుడు ఇదే వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus