Rashmika: ఆ హీరో అంటే ఎంతో ఇష్టం అంటున్న రష్మిక!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని లక్కీ హీరోయిన్లలో రష్మిక ఒకరనే సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సాధించిన రష్మిక మందన్నకు ఈ ఏడాది ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా రిజల్ట్ తో షాక్ తగిలింది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంలో ఆడవాళ్లు మీకు జోహార్లు ఫెయిలైంది. రష్మిక క్రేజ్ కూడా ఈ సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడలేదని కామెంట్లు వినిపించాయి. విజయ్ వంశీ పైడిపల్లి కాంబో మూవీలో రష్మిక హీరోయిన్ గా ఎంపికయ్యారనే సంగతి తెలిసిందే.

నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న రష్మిక తాజాగా ఒక ఆంగ్ల పత్రికతో ముచ్చటించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దేవుడి దయ వల్లే విజయ్, అమితాబ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించే ఛాన్స్ తనకు దక్కిందని రష్మిక వెల్లడించారు. అమితాబ్, విజయ్ లతో తాను నటిస్తున్న సినిమాల కథలు కూడా అద్భుతంగా ఉన్నాయని రష్మిక చెప్పుకొచ్చారు. ఆ హీరోల నుంచి ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకున్నానని ఆమె తెలిపారు.

ప్రతి మూవీతో తాను మెరుగైన నటిగా మారుతున్నానని అనిపిస్తోందని రష్మిక కామెంట్లు చేశారు. తనకు దళపతి విజయ్ అంటే ఎప్పటినుంచో అభిమానమని రష్మిక చెప్పుకొచ్చారు. వంశీ పైడిపల్లి విజయ్ కాంబో మూవీలో తాను హీరోయిన్ గా ఫిక్స్ అయిన తర్వాత విజయ్ ను కలిసిన క్షణాన్ని తాను మరిచిపోలేనంటూ రష్మిక చెప్పుకొచ్చారు. సినిమా పూజా కార్యక్రమం సమయంలో విజయ్ ను చూస్తూ అలా ఉండిపోయానని రష్మిక అన్నారు.

ఆ తర్వాత తాను విజయ్ కు దిష్టి తీశానని నేను దిష్టి తీస్తుంటే విజయ్ ఆశ్చర్యపోతూ అలానే చూస్తూ ఉన్నారని రష్మిక వెల్లడించారు. ఆ తర్వాత సెట్ లో ఉన్నవారంతా గట్టిగా నవ్వారని రష్మిక పేర్కొన్నారు. సినిమాసినిమాకు విజయ్ కు, రష్మికకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పాన్ ఇండియా మూవీగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus