Rashmika: మరోసారి టైమ్‌ మెషీన్‌ ఎక్కనున్న రష్మికను మరోసారి!

రష్మిక మందనకు సరైన పాత్ర పడటం లేదు. ఒకవేళ వచ్చుంటేనా… ఆమె అభిమానులు ఇదే మాట అంటుంటారు. సోషల్‌ మీడియాలో అయితే ఇలాంటి ట్వీట్లు చూడొచ్చు. అయితే అలాంటివాళ్లందరికీ ఓ గుడ్‌ న్యూస్‌. మీ అభిమాన రష్మిక ఓ లేడీ ఓరియెంటెడ్‌ సినిమా చేస్తోంది. ఇందులో కొత్త న్యూస్‌ ఏముంది అనుకుంటున్నారా? ఆ సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టూనే నడుస్తుంది అంటున్నారు. అలా అని అదేదో యాక్షన్‌ సినిమా, పోలీసు సినిమా అనుకునేరు. ఓ అంత్రపెన్యూర్‌ మూవీ అట. అంటే చిన్న కుటుంబంలో పుట్టి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన ఓ యువతి కథ ఆ సినిమా.

రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించడానికి రష్మిక ఒప్పుకుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాస్‌ ఆ సినిమా నిర్మిస్తారని కూడా టాక్‌. ఈ సినిమాకు సంబంధించిన ఓ కాన్సెప్ట్‌ బయట వైరల్‌ అవుతోంది. ఒకవేళ అదే నిజమైతే ముందు చెప్పినట్లు రష్మిక అభిమానులకు కిక్కే కిక్కు. ఎందుకంటే ఇన్నాళ్లూ రష్మిక అంటే క్యూట్‌ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తోంది. అక్కడక్కడ పర్‌ఫార్మెన్స్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసింది. కానీ ఫుల్‌ ప్లెడ్జ్‌గా ఆమె మీద సినిమా రన్‌ అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు రాహుల్‌ రవీంద్రన్‌ సినిమాలో అలాంటి రష్మికను చూడొచ్చంటున్నారు.

ఓ మధ్యతరగతి కిరాణా షాపు కూతురు, జీవితంలో ఎన్నో కష్టనష్టాలను చూసి వ్యాపారవేత్తగా ఎలా ఎదిగింది అనేదే ఈ సినిమా మెయిన్‌ పాయింట్‌ అట. ఈ కథను 1995 నేపథ్యంలో చూపిస్తారని సమాచారం. అంటే దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేపట్టిన సమయం. అప్పుడు ఓ అమ్మాయి ఎలా జీవితాన్ని ప్రారంభించి విజయం సాధించింది అనేది ఈ సినిమాలో రష్మికను చూసి నేర్చుకోవచ్చని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు బయటికొస్తాయి.

రష్మిక ప్రస్తుతం చేస్తున్న ‘ఆడాళ్లు మీ జోహార్లూ’ కూడా ఇలానే మహిళలకు ప్రాధాన్యమిచ్చే సినిమానే. ‘పుష్ప 2’లో కూడా ఆమె పాత్ర బలంగా ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో 2022లో రష్మిక రప్ఫాడించడం ఖాయం అంటున్నారు అభిమానులు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus