Rashmika, Rishab Shetty: స్టార్ హీరోయిన్ రష్మికకు ఆ కృతజ్ఞత లేదా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్న ప్రస్తుతం ఇతర ఇండస్ట్రీలలో సైతం క్రేజీ హీరోయిన్ గా మారిపోయారు. ఏ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా వరుస సక్సెస్ లను అందుకుంటూ ఉండటంతో కొంతమంది రష్మికను గోల్డెన్ లెగ్ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే రష్మిక రిషబ్ శెట్టి మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. రిషబ్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన కిరిక్ పార్టీ సినిమాతో రష్మిక సినీ కెరీర్ మొదలైందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఘన విజయం సాధించడంతో రష్మిక పేరు మారుమ్రోగడంతో పాటు సోషల్ మీడియాలో రష్మికకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కాంతార సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా రష్మిక ఆ అవకాశాన్ని వదులుకున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే తాజాగా కాంతార ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక గురించి మాట్లాడటానికి రిషబ్ శెట్టి ఏ మాత్రం ఇష్టపడలేదు. తాను కొత్త హీరోయిన్లతో నటించాలని భావిస్తున్నానని రిషబ్ శెట్టి తెలిపారు. రష్మిక లాంటి యాక్టర్లతో నేను నటించలేనని రిషబ్ శెట్టి కామెంట్లు చేయడం గమనార్హం.

గతంలో రష్మిక ఒక సందర్భంలో మ్యాగజైన్ కవర్ పేజ్ పై తన స్టిల్ ను చూసి కిరిక్ పార్టీ సినిమాలో ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు. రష్మిక రిషబ్ మధ్య గొడవ జరిగిందని అందుకే రిషబ్ ఇలాంటి కామెంట్లు చేసి ఉండవచ్చని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. రష్మిక కన్నడ ఇండస్ట్రీకి దూరం కావడంపై కూడా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

రష్మికకు కృతజ్ఞత లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక వైరల్ అవుతున్న కామెంట్ల గురించి స్పందించని పక్షంలో ఆమె గురించి నెగిటివ్ అభిప్రాయం కలిగే ఛాన్స్ అయితే ఉంది. నటిగా రష్మిక రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus