Rashmika: వీడియో చూసి మురిసిపోయిన రష్మిక మందన!

‘పుష్ప’ సినిమా విడుదలకు ముందు, విడుదలకు తర్వాత రష్మిక మందన ఎక్కడికెళ్లినా.. అందరూ అడిగే ఒకటే పని.. ‘సామి సామి..’ స్టెప్‌ వేయమని అడగడం. కాస్త నడుము వెనక్కి పెట్టి.. చేయి పైకి ఎత్తి ఊపుతూ వేసే స్టెప్‌ బాగా పాపులర్‌ అయ్యింది. ఇప్పుడు అలాంటి స్టెప్‌ వేసే ఓ చిన్నారి రష్మిక మనసును గెలుచుకుంది. ఏకంగా ఆ చిన్నారిని చూడాలని, ఎలా కలవాలి అంటూ ట్వీట్‌ చేసింది. దీంతో ఆ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఓ పాఠశాలలో తన స్నేహితులతో కలసి ఓ చిన్నారి ‘పుష్ప’ సినిమాలోని ‘సామి సామి..’ అనే పాటకు డ్యాన్స్‌ చేసింది. ఆ పాప డ్యాన్స్‌ను ఎవరో చిత్రీకరించగా, దాన్ని ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. దానికి సంబంధించిన ఓ వీడియో ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియో అటు తిరిగి, ఇటు తిరిగి రష్మిక సోషల్‌ మీడియా టీమ్‌కి చేరినట్లుంది. దాంతో ఆ విషయాన్ని వారు రష్మిక దృష్టికి తీసుకొచ్చారు. దాంతో రష్మిక తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ చిన్నారిని కలవాలనుందని రాసుకొచ్చింది.

దీంతో ఆ వీడియో పోస్ట్‌ చేసిన ట్విటర్‌ హ్యాండిల్‌కు మెసేజ్‌లు వరుసగా వెళ్తున్నాయి. ఈ క్రమంలో కొందరు ఆ పాప నేపాల్‌కు చెందినదని తెలుస్తోంది. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు 18 లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. 92 వేల లైక్‌లు కూడా వచ్చాయి. ఇక ఈ పాట సినిమాతోపాటు యూట్యూబ్‌లోనూ రికార్డు వ్యూస్‌ సంపాదించింది. పాట వచ్చి ఇన్నాళ్లయినా ఇంకా క్రేజ్‌ కొనసాగుతోంది అంటే పాట పవర్‌ మీకే తెలుస్తుంది.

త్వరలో ‘పుష్ప 2’ కూడా వస్తుంది. ఇటీవల లాంఛనంగా సినిమాను ప్రారంభించారు కూడా. త్వరలో సినిమా షూటింగ్‌ పూర్తి స్థాయిలో మొదలవుతుంది. అందులోనూ ఇలాంటి పాటలు చాలానే ఉన్నాయి అని అంటున్నారు. మరి ఆ పాటలు ఎంత క్రేజ్‌ సంపాదంచుకుంటాయో చూడాలి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus