Rathika: వైరల్ అవుతున్న రతిక ఇన్ స్టా పోస్ట్.. అన్యాయం జరిగిందంటూ?

బిగ్ బాస్ హౌస్ నుంచి రతికా రోజ్ ఎలిమినేట్ కావడం ట్రోలర్స్ కు శుభవార్త కాగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ మాత్రం నిరుత్సాహానికి గురయ్యారు. రతిక గురించి తప్పుగా అర్థం చేసుకున్నారని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె పేరెంట్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలో హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో ఈ షో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రతిక స్పందిస్తూ థాంక్యూ ఎవ్రీవన్.. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ (దేర్ ఈజ్ మచ్ మోర్ దన్ వాట్ వూ సా) అని ఇన్ స్టాలో పేర్కొన్నారు. బిగ్ బాస్ హౌస్ లో నన్ను చూసి అంచనాకు రావద్దని షోలో మీరు చూసిన దానితో పోల్చి చూస్తే తెలియాల్సింది చాలా ఉందని రతికా టీం చెప్పుకొచ్చారు. బిగ్ బాస్7 జర్నీలో ప్రేమను, సపోర్ట్ ను అందించిన అభిమానులకు ధన్యవాదాలు అని రతికా టీం అన్నారు.

క్లిష్టమైన పరిస్థితులు ఎదురైన సమయంలో నాకు ఓటు వేసిన జెన్యూన్ ఫ్యాన్స్ కు స్పెషల్ థ్యాంక్స్ అని రతికా టీం అన్నారు. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని రతికా టీం చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ వాళ్లు చూసే కోణం ఉంటుందని అలా చూడటాన్ని తాను గౌరవిస్తానని హేటర్స్, రివ్యూవర్స్, కామెంట్లు చేసేవాళ్ల గురించి రతికా రోజ్ టీం అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

ఇకపై రతిక (Rathika) ఇన్ స్టాగ్రామ్ నుంచి ఆమె నుంచి పోస్ట్ లు వస్తాయని ఆమె టీం చెప్పుకొచ్చింది. రాబోయే రోజుల్లో రతిక కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. రతిక కెరీర్ పై సరిగ్గా ఫోకస్ పెడితే సినిమాల్లో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రతిక మంచి కథలను ఎంచుకుంటే ఒక్కో మెట్టు పైకి ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus