బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రతిక రోజ్ ఒకరు. ఈమె పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈమె ఉన్నది నాలుగు వారాలు అయినప్పటికీ ఎంతో మంది దృష్టిని ఆకర్షించారు. పటాస్ కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ గా చేసినటువంటి ఈమె అనంతరం సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలను అందుకున్నారు.
ఇలా పలు సినిమాలలో నటించిన రాని గుర్తింపు ఈమెకు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమా ద్వారా గుర్తింపు లభించిందని చెప్పాలి. ఇలా ఈ సినిమా ద్వారా లభించిన గుర్తింపుతో బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. అయితే మనకు రతిక నటిక వరకు మాత్రమే తెలుసు కానీ ఈమె విషయానికి వస్తే చిన్నప్పటినుంచి ఎంతో పేదరికంలో పుట్టినటువంటి ఈమె చదువుపై ఎప్పుడు ఎంతో ఆసక్తి కనపరుస్తూ ముందంజలో ఉండేది.
ఇక ఎంసెట్ ప్రవేశ పరీక్షలో వందలోపు ర్యాంక్ తెచ్చుకున్నటువంటి రతిక దృష్టి మంత్రి మల్లారెడ్డి పై పడింది దీంతో ఆమెకు ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా తన కాలేజీలో ఫ్రీగా బీటెక్ చేయించి అలాగే హాస్టల్ ఫీస్ లేకుండా చదివించారు. అప్పటినుంచి మంత్రి మల్లారెడ్డితో ఈమె ఫ్యామిలీకి చాలా మంచి అనుబంధం ఉందని చెప్పాలి. ఇలా బీటెక్ పూర్తి చేసిన తర్వాత రతిక ఉన్నత ఉద్యోగం వైపు కాకుండా సినిమాలపై తన మనసు మళ్లింది.
సినిమాలలో నటించాలి అన్న ఉద్దేశంతో ఇండస్ట్రీ వైపు వచ్చినటువంటి (Rathika) ఈమె మొట్టమొదటిసారి పటాస్ కార్యక్రమంలో నటించారు. ఆ తర్వాత పలు కార్యక్రమాలలో సినిమాలలో అవకాశాలు అందుకొని నటిస్తూ ఇలా బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో ఈమె ప్రవర్తన శైలి నచ్చకపోవటం వల్లే నాలుగవ వారం బయటకు వచ్చారని తెలుస్తుంది. ఇలా హౌస్ లో నాలుగు వారాలు ఉన్నప్పటికీ ఈమె ఎంతో మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి.