Rathika: భగవంత్ కేసరి సినిమాతో రతికా రోజ్ జాతకం మారిపోనుందా?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అటు బాలయ్య ఇటు శ్రీలీల పాత్రలను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ చేరగా ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది. దసరా సెలవులు పూర్తయ్యే వరకు భగవంత్ కేసరి హవా కొనసాగే ఛాన్స్ ఉంది.

భగవంత్ కేసరి సినిమాకు 68 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగడం గమనార్హం. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో రతికా రోజ్ కనిపించడం గమనార్హం. ఎమ్మెల్యే పాత్రలో కనిపించిన రతికా రోజ్ ఆ పాత్రతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. భగవంత్ కేసరి సినిమాతో రతికా రోజ్ జాతకం మారిపోనుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా రతిక పలు సినిమాలలో నటించారు.

బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తున్న రతిక (Rathika) ఈసారి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ షో ద్వారా రతికకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కుతోందని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రతిక మరిన్ని సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. భగవంత్ కేసరి సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది.

ఒకింత ఆలస్యంగానే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. భగవంత్ కేసరి శాటిలైట్ హక్కుల విషయానికి వస్తే జీ తెలుగు ఛానల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటం గమనార్హం. అనిల్ రావిపూడి డైరెక్షన్ స్కిల్స్ కు నెటిజన్ల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. బాలయ్య, అనిల్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus