Bigg Boss 7 Telugu: రతిక డబుల్ గేమ్..! ప్రిన్స్ తో పులిహోర కలుపుతూ వెన్నుపోటు..! అసలేం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో రతిక ఎన్ని షేడ్స్ చూపించాలో అన్ని రంగులు చూపిస్తోంది. మూడోవారం ప్రశాంత్ తో లొల్లి పెట్టుకుని తనని ఛీకొట్టే వరకూ మాట్లాడింది. అలాగే, మీద చేయి వేస్తుంటే చేయి వేస్తే అస్సలు బాగోదు పో అంటూ వార్నింగ్ ఇచ్చింది. పవర్ అస్త్రాని పొగొట్టుకుని ఒక పక్క శివాజీ ఏడుస్తుంటే ప్రశాంత్ – రతికల లొల్లి ఎక్కువైపోయింది. వీరిద్దరూ మాటకి మాట పెంచుకుని నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకూ వచ్చారు.

నా ముందర నుంచీ వెళ్లిపో అంటూ ప్రశాంత్ రెచ్చిపోయాడు. అలాగే, రతిక కూడా ఏం చేస్తావ్ అంటూ ప్రశాంత్ ని రెచ్చగొట్టింది. ఇద్దరి మద్యలో మాటకి మాట పెరిగింది. అంతకు ముందు రోజే బెడ్ రూమ్ లో పడుకున్న రతిక అద్దం బయట ఉన్న ప్రశాంత్ తో గేమ్ ఆడుతూ సరదాగా కనిపించింది. కానీ, పొద్దుడ్నుంచీ పల్లవి ప్రశాంత్ పై విరుచుకునిపడింది. దీంతో ప్రశాంత్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా రతికకి ఇచ్చిపారేశాడు.

ఇది కేవలం రతిక కంటెంట్ కోసమే చేస్తోందా అన్నట్లుగానే అనిపించింది. ఇక నెక్ట్స్ బిగ్ బాస్ ఇచ్చిన మూడో వారం ఇమ్యూనిటీ టాస్క్ లో రతిక మరో యాంగిల్ చూపించింది. గతవారం షకీల కంటే ప్రిన్స్ యావార్ డిసర్వ్ అంటూ మొత్తుకున్న రతిక ఈసారి ప్రిన్స్ యావార్ ని గేమ్ నుంచీ తప్పించేందుకు కన్ఫషన్ రూమ్ కి వెళ్లి మరీ ఓటు వేసింది. బిగ్ బాస్ స్వయంగా సెలక్ట్ చేసిన ముగ్గురులోనుంచీ ఒక కంటెండర్ ని తప్పించాలి అన్నప్పుడు రతిక ఆలోచించి ప్రిన్స్ యావార్ కి ఓటు వేసింది.

ఇక్కడ గేమ్ అంటే కేవలం టాస్క్ లు ఒక్కటే కాదని, ప్రిన్స్ యావార్ ఇంటి పనుల్లో చాలా తక్కువగా పార్టిసిపేట్ చేస్తాడని చెప్పింది. అంతేకాదు, తనకి షార్ట్ టెంపర్ కాబట్టి మూడువారాల ఇమ్యూనిటీ, ఇంకా పర్మినెంట్ హౌస్ మేట్ అతను అయ్యే అర్హత లేదని తేల్చేసింది. నిజానికి రతిక గతవారం ప్రిన్స్ కోసం పెద్ద ఫైట్ చేసింది. దీన్ని బట్టీ తను డబుల్ గేమ్ ఆడుతోందా అనిపిస్తోంది.

ఇక ప్రిన్స్ ని నామినేట్ చేస్తూ ఓటు వేసిన తర్వాత ప్రిన్స్ తో కిచెన్ లో పులిహోర కలపడం స్టార్ట్ చేసింది. ఇద్దరూ కలిసి ఒకే ప్లేట్ లో ఆమ్లెట్ వేసుకుని తిన్నారు. ఇక మరో లవ్ ట్రాక్ ని స్టార్ట్ చేశాడు బిగ్ బాస్ అనేలా ప్రోమోని కట్ చేసి మరీ చూపించాడు. దీంతో వామ్మో రతికలో ఇన్ని షేడ్స్ ఉన్నాయా అని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus