బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు కార్యక్రమం 4 వారాలను పూర్తి చేసుకుంది. 11 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఇప్పటికే నాలుగు వారాలను పూర్తి చేసుకుని నలుగురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక నాలుగవ వారంలో భాగంగా రతికా హౌస్ నుంచి బయటకు వచ్చారు. మొదటివారం హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు. ఇకరెండో వారం షకీలా మూడోవారం దామిని ఎలిమినేట్ అయ్యారు.
ఇక నాలుగవ వారంలో భాగంగా టేస్టీ తేజ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో మాత్రం రతిక హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. రతిక ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.నేను ఎలిమినేట్ అవ్వడం కలగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. దీన్నిబట్టి హౌజ్‌లో ఉండాలని ఆమె ఎంత గట్టిగా అనుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈమె 4 వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటికీ రెమ్యూనరేషన్ పరంగా మాత్రం భారీగానే సంపాదించారని తెలుస్తుంది. నాలుగు వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి ఈమె వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలా వారానికి రెండు లక్షలు చొప్పున నాలుగు వారాలకు గాను ఈమె ఎనిమిది లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తుంది.
ఇలా నాలుగు వారాలకి ఎనిమిది లక్షలు సంపాదించినటువంటి ఈమె మరికొన్ని రోజులపాటు హౌస్ లో కొనసాగి ఉంటే భారీగానే సంపాదించి ఉండేదని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా రతిక ఎలిమినేట్ కావడంతో హౌస్ సభ్యులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇక ఈమె ఎలిమినేట్ కావడానికి కూడా కారణాలు లేకపోలేదని చెప్పాలి. రతిక (Rathika) ఎలిమినేట్ కావడంతో ప్రేక్షకులు కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవ్వడం గమనార్హం.