మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావణాసుర’. ‘అభిషేక్ పిక్చర్స్’ ‘ఆర్.టి.టీం వర్క్స్’ బ్యానర్లపై అభిషేక్ నామా, రవితేజ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాష్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా.. వంటి క్రేజీ హీరోయిన్లు ఈ చిత్రంలో నటించారు. జయరాం, రావు రమేష్, భరత్ రెడ్డి, శ్రీరామ్, సంపత్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు.
టీజర్, ట్రైలర్ లు సో సోగా ఉన్నాయి. దీంతో సినిమాపై బజ్ అంతగా ఏర్పడలేదు. నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి ఓపెనింగ్సే నమోదయ్యాయి.కానీ రెండో రోజు నుండి స్లో అయిపోయింది ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 3.60 cr |
సీడెడ్ | 1.32 cr |
ఉత్తరాంధ్ర | 1.26 cr |
ఈస్ట్ | 0.66 cr |
వెస్ట్ | 0.43 cr |
గుంటూరు | 0.68 cr |
కృష్ణా | 0.44 cr |
నెల్లూరు | 0.28 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.67 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.70 cr |
ఓవర్సీస్ | 1.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 10.37 cr (షేర్ |
‘రావణాసుర’ (Ravanasura) చిత్రాన్ని చాలా వరకు నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.19 కోట్లుగా ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.10.37 కోట్ల షేర్ నమోదైంది. ఇవి జస్ట్ ఓకే అనిపించే ఓపెనింగ్స్ మాత్రమే. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.8.63 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
రెండో రోజు నుండి ఈ మూవీ కలెక్షన్స్ పడిపోయాయి. ఓవర్సీస్ మాత్రం తక్కువ రేట్లకు ఇచ్చారు కాబట్టి.. అక్కడ గట్టెక్కేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యమన్నట్టే కనిపిస్తుంది.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!