అలలపై తేలియాడుతూ క్రూయిజ్ నౌక పార్టీ ఏర్పాటు చేసింది ఓ సంస్థ. దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసి టికెట్లు అమ్ముకుంది. పార్టీలంటే సరదా ఉన్న చాలామంది యువతీయువకులు ఆ పార్టీకి హాజరయ్యారు. సుమారు వెయ్యి మంది ఆ పార్టీకి హాజరయ్యారని టాక్. ఇంతలో పోలీసులు ఎంటరయ్యారు. పార్టీని ఆపేసి… అందులో కొందరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ కూడా ఇచ్చింది. బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు.
అయితే వెయ్యి మందిలో కేవలం ఎనిమిది మందిని మాత్రమే అరెస్టు చేశారనే టాక్ వినిపిస్తోంది. ముంద్రా పోర్టులో చిక్కిన వేల కోట్ల హెరాయిన్ కేసును దారి మళ్లించడానికే పోలీసులు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై తాజాగా సీనియర్ నటి రవీనా టాండన్ కూడా స్పందించారు. పరోక్షంగా ఆర్యన్‌కు మద్దతుగా మాట్లాడారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ‘సిగ్గు లేని రాజకీయాల వల్ల ఒక యువకుడి జీవితం, భవిష్యత్తు నాశనం అవుతున్నాయి’ అంటూ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు రవీనా టాండన్.
ఆమె ఈ ట్వీట్‌లో యువకుడు అని రాసినా… ఎవరి గురించి ఆ ట్వీట్ చేశారో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆర్యన్‌కు, షారుఖ్ ఖాన్ కుటుంబానికి మద్దతుగా ఇప్పటివరకు సునీల్ శెట్టి, హృతిక్ రోషన్ మద్దతుగా నిలిచారు. ఈ అపత్కాల సమయంలోనే ధైర్యంగా ఉండాలని సూచించారు.