ఈటీవీ కొత్త ఓటీటీలో నేరుగా వచ్చేస్తున్న రవిబాబు సినిమా.. ‘అసలు’ ఎవరు?

టాలీవుడ్‌ సినిమాల యందు రవిబాబు సినిమాలు వేరయా అంటుంటారు. అందరూ ఓ జోనర్‌లో నడిస్తే.. ఆయన ఇంకో జోనర్‌లో సినిమాలు తీస్తుంటారు. అలా ఆయన తీసిన సినిమాల్లో హారర్‌ చిత్రాలకు మంచి పేరొచ్చింది. ‘అవును’ సిరీస్‌లో రెండు సినిమాలకు మంచి పేరొచ్చింది. ఇంచుమించు అదే జోనర్‌లో ఇప్పుటు ‘అసలు’ అనే ఓ సినిమా చేశారు. చాలా రోజుల క్రితమే పూర్తయిన ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేస్తున్నారు. అయితే థియేటర్‌లో కాదు, ‘విన్‌’లో. అదేనండీ ఈటీవీ వాళ్ల ఓటీటీ విన్‌లో.

కామెడీ డ్రామా, క్రైమ్ సస్పెన్ థ్రిల్లర్ సినిమాలు తీయడంలో రవిబాబుకు మంచి ప్రవేశం ఉంది. ‘అనసూయ’, ‘అవును’ వంటి సినిమాలతో మంచి విజయం అందుకున్నారు కూడా. ఇప్పుడు ‘అసలు’ అనే టైటిల్ తో మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో పూర్ణ నటించారు. సినిమా కథేంటి అనే విషయం తెలియదు కానీ.. హారర్‌ – థ్రిల్లర్‌ అవ్వొచ్చు అని టీజర్‌ పోస్టర్‌ చూస్తే తెలిసిపోతోంది. మిర్రర్‌ బ్లైండ్స్‌ వెనుక నుండి అమ్మాయి చూస్తున్నట్లుగా ఆ పోస్టర్‌ సిద్ధం చేశారు.

ఈ సినిమాలో రెండు విషయాలు కామన్‌ అని చెప్పొచ్చు. ఒకటి పూర్ణ అయితే, రెండోది ‘అ’ అనే అక్షరం. ఈ రెండూ రవిబాబుకు బాగా కలిసొచ్చేవే అని చెప్పాలి. రవిబాబు మొదటనుండీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు చేసేటప్పుడు ‘అ’ అనే అక్షరంతోనే పేరు పెడుతూ వచ్చారు. ‘అనసూయ’, ‘అమరావతి’, ‘అవును 1’, ‘అవును 2’. ఇప్పుడు అదే వరుసలో సినిమాకు ‘అసలు’ అని పేరు పెట్టారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 5 నుంచి ఈటీవీ విన్‌ ఓటీటీలో వీక్షించొచ్చు.

గతంలో తన సినిమాలతో భయపెట్టిన రవిబాబు ఈసారి ఎంత భయపెడతారో చూడాలి. మరోవైపు పూర్ణ సినిమాలు తగ్గించేశారు. టీవీ షోలతో బిజీగా గడిపారు. అయితే ఇప్పుడు గర్భవతి కావడంతో పూర్తిగా నటనకు, టీవీలకు దూరంగా ఉన్నారు. కాబట్టి ఈ సినిమాకు ప్రచారం చేయడం కుదరకపోవచ్చు. మరి రవిబాబు అయినా ప్రచారం చేస్తారేమో చూడాలి. అయితే ఆయనకు ఇటీవల సరైన విజయాలు లేవు. దీంతో ఈ సినిమాతో డైరెక్ట్‌ ఓటీటీ ఎంట్రీ ఎలా పని చేస్తుందో చూడాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus