Ravi Babu: ”మన సంస్థ.. మనం నడుపుకోలేమా? మనకి చేతకాదా?”: రవిబాబు

  • October 6, 2021 / 02:39 PM IST

టాలీవుడ్ లో ‘మా’ ఎలెక్షన్స్ వివాదం రోజురోజుకీ ముదిరిపోతోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ ఒకరినొకరు దూషించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్-మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ ఎలెక్షన్స్ పై ఇప్పటికే కొందరు తారలు స్పందించారు. తాజాగా దర్శకుడు రవిబాబు కూడామాట్లాడారు. లోకల్, నాన్ లోకల్ వ్యవహారం గురించి తాను స్పందించాలనుకోవడం లేదంటూనే.. అధ్యక్ష పదవికి బయటవాళ్లు ఎందుకని ప్రశ్నించారు.

ఏదో ఒక ప్యానెల్ కి మాత్రమే ఓటు వేయమని చెప్పాలనుకోవడం లేదని అన్నారు రవిబాబు. అయితే తెలుగులో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉండగా.. మన దర్శకనిర్మాతలు మాత్రం బయటవాళ్లకే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారని.. వాళ్ల డిమాండ్ లకు ఒప్పుకొని మరీ ఆఫర్లు ఇస్తున్నారని అన్నారు. అదే విధంగా కెమెరామెన్‌లు, మేకప్‌మేన్‌లు.. ఇలా సినిమాకి సంబంధించిన చాలా విభాగాల్లో మన వాళ్లకంటే బయటవాళ్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయం పక్కన పెడితే..

నటీనటుల సంక్షేమం కోసం వాళ్ల సమస్యల పరిష్కారం కోసం మనం ఏర్పాటు చేసుకున్న చిన్న సంస్థ ‘మా’ అని అన్నారు. మన కోసం మనం పెట్టుకున్న అలాంటి సంస్థలో పనిచేయడానికి మనలో ఒకడు పనికిరాడా..? అని ప్రశ్నించారు. దీనికి కూడా బయటినుంచే మనుషులను తెచ్చుకోవాలా..? ఇది మన సంస్థ.. మనం నడుపుకోలేమా..? మనకి చేతకాదా..? ఒక్కసారి ఆలోచించండి అంటూ కీలకవ్యాఖ్యలు చేశారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus