Ravi Teja: పాన్ ఇండియా కాన్సెప్ట్ పై రవితేజ సెటైర్!

ఈ మధ్యకాలంలో సౌత్ నుంచి వస్తోన్న చాలా సినిమాలకు పాన్ ఇండియా ట్యాగ్ లైన్ తగిలిస్తున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో కొన్ని సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ పోకడపై రవితేజ తనదైన స్టైల్ లో స్పందించారు. ఒక సినిమాను భారీగా రిలీజ్ చేస్తే పాన్ ఇండియా అవ్వదని అంటున్నారు మాస్ మహారాజ రవితేజ. పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ గురించి తను అనుకుంటున్నది వేరని చెప్పారు. భారీగా రిలీజ్ చేస్తే ప్రతీదీ పాన్ ఇండియా సినిమా అయిపోదని అన్నారు.

తన సినిమాల్లో ‘టైగర్ నాగేశ్వరావు’ పాన్ ఇండియా సినిమా అవుతుందని.. పాన్ ఇండియా అవ్వాలంటే కథలో కంటెంట్ ఉండాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో పాటు కాంబినేషన్స్ పై కూడా స్పందించారు. తను కాంబినేషన్ ను నమ్మనని.. కథను నమ్ముతానని అన్నారు. కథ నచ్చకుండా కాంబినేషన్ కుదిరిందని చేయడం తనవల్ల కాదని చెప్పుకొచ్చారు. కథ నచ్చితేనే ఓకే చేస్తానని.. ఇంకాస్త పక్కాగా చేసుకొని రమ్మంటానని అన్నారు. ముందుగా కథ నచ్చాలి..

కథ నచ్చకుండా కాంబినేషన్ గురించి చేసే ప్రసక్తే లేదని అన్నారు. ఇండస్ట్రీలో ఎవరూ కూడా కథ నచ్చకుండా సినిమా చేయరని అన్నారు. ప్రస్తుతం రవితేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన కెరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాది ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలతో డిజాస్టర్ అందుకున్న రవితేజ.. ఇప్పుడు ‘ధమాకా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. అలానే రవితేజ చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus