Ravi Teja: రవితేజ ఆ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడా?

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో విక్రమార్కుడు సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీగా సక్సెస్ సాధించడంతో పాటు రవితేజకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది. అయితే ఈ మధ్య కాలంలో రవితేజ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నా విక్రమార్కుడు స్థాయి సక్సెస్ ను మాత్రం రవితేజ అందుకోవడం లేదు.

సుధీర్ వర్మ డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు రావణాసుర అనే టైటిల్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హీరోస్ డోంట్ ఎగ్జిట్ అనే ట్యాగ్ లైన్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన రావణాసుర టైటిల్ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే అంచనాలను ప్రేక్షకుల్లో ఏర్పరచింది. సుధీర్ వర్మ రవితేజను పది ముఖాలతో రావణాసురుడిగా ప్రేక్షకులకు పరిచయంచేశారు.

స్వామి రారా సినిమాతో టాలీవుడ్ కు దర్శకునిగా పరిచయమైన సుధీర్ వర్మ ఈ మధ్య కాలంలో ఆ స్థాయి సక్సెస్ ను అందుకోలేదు. రణరంగం సినిమా తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాతో సుధీర్ వర్మ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది. ఈ సినిమా రవితేజకు మరో విక్రమార్కుడు అవుతుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ సినిమాతో ఫ్యాన్స్ ఆశలు తీరతాయో లేదో చూడాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus