ఇలియానా విషయంలో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న రవితేజ!

రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో ఇప్పటికి ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు వంటి పలు సినిమాలు వచ్చాయి. ఇక వీరిద్దరూ కలసి మరోసారి కలసి నటిస్తున్న సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోని’. శ్రీనువైట్ల దర్శకత్వంలో, మైత్రి మూవీస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ ఇంటర్వూస్ కూడా ఇస్తున్నాడు. కానీ ఇప్పటివరకు హీరోయిన్ ఇలియానా మాత్రం ఎలాంటి ఇంటర్వ్యూ అనేది ఇవ్వలేదు. గతంలో కూడా ఇలియానా ప్రమోషన్స్ కి చాలా దూరంగా ఉండేది. ఒకవేళ తాను ప్రమోషన్స్ కి రావాలంటే దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలనే రూల్ పెట్టినట్లుగా కొందరు చెబుతారు.

ఇక మంచి సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ కోసం మైత్రి మూవీస్ ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయనున్నారట. అయితే హీరో రవితేజ బాలీవుడ్ లో సక్సెస్ లేక కాలిగా ఉన్న ఇలియానాకి అడిగి మరి ఆఫర్ ఇప్పిస్తే ఆమె మాత్రం అసలు మారకుండా ఎప్పటిలానే బిహేవ్ చేస్తుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. హీరో రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల ప్రమోషన్స్ కి రాలేదు కనీసం గ్రాండ్ గా చేస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయినా తప్పకుండ రావాలంటూ మెసేజెస్ చేసినప్పటికీ ఇల్లుబేబి నుండి అసలు రెస్పాన్స్ రాలేదంటా. మరి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తే వస్తుందో, హీరో రవితేజ కోసం వస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus