సంక్రాంతి పండక్కి అందరికంటే ముందే జనవరి 9వ తేదిన థియేటర్స్ లో సందడి చేశాడు మాస్ మహారాజా. ఫస్ట్ డే షో పడకపోయే సరికి సినిమా సెంటిమెంట్ ప్రకారం ఫట్ అయిపోతుందేమో అని ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు. కలవర పడ్డారు. కానీ, అంచనాలని తల్లకిందులు చేస్తూ క్రాక్ సినిమాతో మంచి కిరాక్ టాక్ ని అందుకున్నాడు రవితేజ. విడుదల అయిన అన్ని సెంటర్స్ నుంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది ఈ సినిమా.
రొటీన్ గా వచ్చిన పోలీస్ కథలే అయినప్పటికీ ,కేవలం తన స్క్రీన్ ప్లే తో, మేకింగ్ తో మెప్పించాడు డైరెక్టర్ మలినేని గోపిచంద్. కేవలం 50 శాతం ఆక్యూపెన్సీతోనే ఈ సినిమా లాభాల బాట పడుతోంది అంటే మాస్ రాజా దెబ్బ అదిరింది అనే చెప్పాలి. లెక్కల పరంగా చూస్తే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి కలక్షన్స్ ని సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. వరుసగా పండక్కి సినిమాలు వస్తున్నా క్రాక్ వసూళ్లు నిలకడగా ఉండటం సినిమాకి కలిసొచ్చే అంశం.
గత కొన్ని సినిమాలుగా మాస్ మహారాజా కి హిట్ లేకుండా ఉన్న ఈ టైమ్ లో ఈ క్రాక్ సినిమా మంచి కమ్ బ్యాక్ మూవీగా అయ్యింది. అంతేకాదు, మలినేని గోపించంద్ ఇంకా రవితేజకి ఇది హ్యాట్రిక్ హిట్ కావడం విశేషం.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!