ఒక సినిమా మీద ఎంత ప్రేమ లేకపోతే విడుదలైన ఆరు సంవత్సరాల తర్వాత రీమేక్ చేయడానికి ఓ హీరో – దర్శకుడు ముందుకొస్తారు చెప్పండి. కొత్త సినిమాల రీమేక్‌లే తెలుగులో వర్కవుట్ కావడం లేదు అని అనుకుంటున్న ఈ రోజుల్లో ఏకంగా ఆరేళ్ల క్రితం విడుదలై ఓటీటీల్లో అందుబాటులో ఉన్న సినిమాను రీమేక్ చేస్తున్నారు రవితేజ – హరీశ్ శంకర్. ఆ సినిమానే ‘మిస్టర్ బచ్చన్’. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమాను కూడా రీమేక్ చేయడానికి రెడీ అయిపోయారట.
బాలీవుడ్‌లో 2018లో అజయ్ దేవగణ్ – ఇలియానా ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘రెయిడ్’. ఈ సినిమాకు బాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర మంచి విజయమే అందుకుంది. రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 150 కోట్ల వరకు వసూలు చేసింది. ఆ సినిమా వచ్చిన తొలి రోజుల్లోనే దీనిని తెలుగులో రీమేక్ చేయాలని రవితేజ అనుకున్నారు. దాని గురించి కొంతమంది దర్శకులతో చర్చలు కూడా జరిగాయి. అయితే హరీశ్ శంకర్ చేస్తారు అని వార్తలొచ్చాయి. కానీ జరగలేదు.
ఇప్పుడు ఎట్టకేలకు ‘మిస్టర్ బచ్చన్’ పేరుతో ఇటీవల షూటింగ్ ప్రారంభించారు. ఇది జరిగి ఇంకా గట్టిగా నెల కూడా కాలేదు అప్పుడే ‘మిస్టర్ బచ్చన్ 2’ ముచ్చట్లు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ‘రెయిడ్ 2’ సినిమా ఓపెనింగ్‌కి ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ వెళ్లడమే. అజయ్ దేవగణ్ హీరోగానే తెరకెక్కుతున్న ఆ సినిమా ఇటీవల ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ‘మిస్టర్ బచ్చన్’ టీమ్‌కి పిలుపు వస్తే హీరో, దర్శకుడు, నిర్మాత ప్రత్యేకంగా వెళ్లి అభినందనలు చెప్పి మరీ వచ్చారు.
‘రెయిడ్’ సీక్వెల్ కథ గురించి ముంబయిలో తెలుసుకున్న (Ravi Teja) రవితేజ… రెండో పార్టును కూడా చేయడానికి సిద్ధమని చెప్పారు అంటున్నారు. ‘రెయిడ్ 1’ రీమేక్ లేట్ అయ్యిందేమో కానీ, సీక్వెల్ రీమేక్ విషయంలో మాత్రం రవితేజ వెంటనే షురూ చేద్దాం అంటున్నాడట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!