Renu Desai: అకీరా నందన్‌ ఎంట్రీ ఎప్పుడు? ఫ్యాన్స్‌కి సమాధానం ఇవ్వాల్సిందే ఆయనేనా?

అకీరా నందన్‌ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు? ఈ ప్రశ్న చాలామంది నోట, చాలాసార్లు వినిపించింది. దీనికి సమాధానం ఇద్దరే కరెక్ట్‌గా చెప్పగలరు. ఒకరు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) , రెండో వ్యక్తి రేణు దేశాయ్‌(Renu Desai). పవన్‌ మీడియా ముందుకు వస్తే, అందులోనూ సినిమా లుక్‌లో వస్తే మీ సినిమా ఎప్పుడు అని అడుగుతారు కానీ.. అకిరా సినిమా ఎప్పుడు అని అడగరు. కాబట్టి రేణు దేశాయ్‌కే ఈ ప్రశ్న ఎక్కువగా ఎదురువుతూ ఉంటుంది.

Renu Desai

Renu Desai on Akira Nandan entry into the Film Industry (5) Pawan Kalyan Family Son Daughter

అలా రీసెంట్‌గా ఆమె రాజమహేంద్రవరం వెళ్తే అక్కడా ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె చెప్పిన సమాధానం చూసి అభిమానులు షాక్‌ అయ్యారు. అకీరానందన్‌ సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నానని, ఆ రోజు కోసం తానెంతో ఆసక్తి, ఆత్రుతతో ఉన్నానని రేణు దేశాయ్‌ (Renu Desai) చెప్పారు. అంతే కాదు హీరోగా అకిరా మెప్పిస్తాడనే నమ్మకం ఉందని చెప్పారు. అయితే ఎప్పుడు వస్తాడు అనేది చెప్పలేదు.

అంతేకాదు ఆ విషయం అకిరానే చెప్పాలి, అతను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు సినిమాల్లోకి పంపిస్తా అనేలా ఆమె మాట్లాడారు. దీంతో అకిరా సంగతి ఇక ఆయనను కానీ, పవన్‌ కల్యాణ్‌ని కానీ అడగాలి అని అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు. ఎందుకంటే రేణు దేశాయ్‌ నుండి సమాచారం అయితే రావడం లేదు. అయితే గతంలో అకిరాకు నటన అంటే అంతగా ఆసక్తి లేదు అని చెప్పినట్లు రేణు దేశాయ్‌ ఓ సందర్భంలో అన్నారు.

ఇక ఆ విషయం వదిలేస్తే.. అకిరా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటున్నాడు అని సమాచారం. విశాఖపట్నంలో నట గురువు సత్యానంద్‌ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడని వార్తలొస్తున్నాయి. దానికితోడు తరచుగా పవన్‌ కల్యాణ్‌ దగ్గరే కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో అకిరా తెరంగేట్రం పక్కా అని చెప్పొచ్చు. చూద్దాం పవన్‌ ఏమన్నా చెబుతారేమో. అన్నట్లు పవన్ కల్యాణ్‌ కూడా సినిమాల్లోకి వచ్చే ముందు సత్యానంద్‌ దగ్గరే శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.

గేమ్ ఛేంజర్ నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ కి సోనూసూద్ వల్ల ఇబ్బందులు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus