క్రాక్ కలెక్షన్స్: మాస్ రాజా నెంబర్ వన్ రికార్ట్

మాస్ మహారాజా కెరీర్ లోనే బెస్ట్ రికార్డ్ అందుకునేలా చేసింది క్రాక్ మూవీ. థియేటర్స్ సగమే నిండినా కలెక్షన్స్ మాత్రం ఫుల్ అనేలా వచ్చాయి. పెద్దగా హడావుడి లేకుండా టికెట్ల రేట్లను సైలెంట్ గానే పెంచారు. ఆ విషయాన్ని ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. సినిమాకు మంచి బజ్ ఉండడంతో పండగ సీజన్ బాగా కలిసొచ్చింది. రవితేజ కెరీర్ మొత్తంలో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా క్రాక్ మంచి గుర్తింపు దక్కించింది.

మొదటిరోజు రవితేజ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల షేర్స్ లిస్ట్ ఈ విధంగా ఉంది.. కిక్ 2 – 5.8కోట్లు. బెంగాల్ టైగర్ – 5.3కోట్లు. పవర్ – 5.15కోట్లు. రాజా ది గ్రేట్ – 4.92కోట్లు. టచ్‌ చేసి చూడు – 4.15కోట్లు.. సాధించాయి. ఇక క్రాక్ శనివారం విడుదల కావాల్సింది. కానీ ఫస్ట్ షో నుంచి షోలు మొదలయ్యాయి కాబట్టి ఆదివారం షోలోతో కలిసి ఓపెనింగ్స్ గా లెక్కిస్తున్నారు. ఇక వాటికి రూ.6.25కోట్ల షేర్స్ వచ్చాయి.

రవితేజ ఈ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం ఇదే మొదటిసారి. ఒకవేలం థియేటర్స్ ఫుల్ 100% సిట్టింగ్ కెపాసిటీతో నడిచి ఉంటే ఆ లెక్కలు ఏ రేంజ్ లో ఉండేవో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరి ఈ సంక్రాంతి మూడు రోజుల్లో సినిమా ఇంకెంత రాబడుతుందో చూడాలి.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus